Site icon HashtagU Telugu

Ind – Pak Match : ఇండియా – పాక్ మ్యాచ్ దెబ్బకు స్విగ్గీకి రికార్డు స్థాయిలో బిర్యానీ ఆర్డర్స్

Swiggy Records 250 Biryani

Swiggy Records 250 Biryani

క్రికెట్ (Cricket) అంటే మన భారతీయులకు ఎంతగా ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు..ముఖ్యంగా ఇండియా – పాక్ (India vs Pakistan) మ్యాచ్ అంటే మరి..ఎన్ని పనులు ఉన్న..అవన్నీ పక్కన పెట్టి టీవీలకు హత్తుకొని చూస్తుంటారు. మ్యాచ్ మొదలైన దగ్గరి నుండి అయిపోయే వరకు లేవడం కూడా చేయరు. ఫుడ్ , వాటర్ ఇలా ప్రతిదీ కూర్చున్న దగ్గిరికి వచ్చేలా చూసుకుంటారు. ప్రస్తుతం భారత్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ (2023 World Cup) జరుగుతున్న సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

నేడు యావత్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా – పాక్ (India vs Pakistan) మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా ..పాక్ ఫై (India wins against Pakistan by 7 wickets) ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకే కాదు ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy ) కి కూడా బాగా కలిసొచ్చింది. బిర్యానీ (Biryani) అంటే ఇష్ట‌ప‌డని వారెవ‌రైనా ఉంటారా? అంటే ఉండ‌నే ఉండ‌రు. బిర్యానీ వాస‌న‌కే క‌డుపు నిండిపోతోంది. మ‌రి అంత‌టి రుచిక‌ర‌మైన బిర్యానీ కోసం..ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ లో ఈరోజు ఇండియా – పాక్ మ్యాచ్ చూస్తూ ఏకంగా నిమిషానికి 250 బిర్యానీ ఆర్డర్లు పెట్టారంట. ఈ విషయాన్నీ స్వయంగా స్విగ్గీనే తెలిపింది.

మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి నిమిషానికి 250 బిర్యానీలు ఆర్డర్‌ (Swiggy Records 250 Biryani Orders) చేశారట. అలాగే చంఢీగడ్‌లో ఓ ఫ్యామిలీ ఏకంగా 70 బిర్యానీలు ఆర్డర్‌ పెట్టినట్లు స్విగ్గీ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్టు పెట్టింది. కేవలం బిర్యానీలు మాత్రమే కాదు మ్యాచ్ సమయంలో 1 లక్షకు పైగా కూల్ డ్రింక్స్ , 10,916 మరియు 8,504 యూనిట్ల బ్లూ లే (చిప్స్) మరియు గ్రీన్ లే ఆర్డర్ చేయబడ్డాయని తెలిపింది.

Read Also  : World Cup: ఆడుతూ పాడుతూ… పాక్‌ను చిత్తు చేసిన భారత్‌