Site icon HashtagU Telugu

Suryakumar Yadav: మరోసారి తొలిబంతికే సూర్యకుమార్ ఔట్.. సోషల్ మీడియాలో ట్రోల్స్..!

Suryakumar

Suryakumar

ఐపీఎల్-2023లో ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ప్రతి మ్యాచ్‌లో తొలిబంతికే అవుట్ అవుతున్న సూర్య.. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ తొలిబంతికే ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు. దీంతో అతని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023 16వ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు అద్భుతంగా ఆరంభించి చివరి బంతికి ఊపిరి పీల్చుకున్నారు. ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయగా, తిలక్ వర్మ 41 పరుగులు చేశాడు. కానీ ఈ మ్యాచ్‌లోనూ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ ఘోరంగా విఫలమయ్యాడు. ఖాతా తెరవకుండానే తొలి బంతికే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ ఫ్లాప్ షో తర్వాత అభిమానులు సూర్యని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Also Read: CSK: చెన్నై సూపర్ కింగ్స్ ను బ్యాన్ చేయాలని డిమాండ్.. కారణమిదే..?

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ సిరీస్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం వచ్చిందని, అయితే అతను బ్యాట్‌తో విఫలమమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వన్డే సిరీస్‌లో వరుసగా మూడుసార్లు గోల్డెన్ డక్‌కి గురయ్యాడు. అదే సమయంలో IPL 2023లో కూడా సూర్యకుమార్ బ్యాట్ నిశ్శబ్దంగా ఉంది. ముంబై ఇండియన్స్ మొదటి రెండు మ్యాచ్‌లలో సూర్య మొత్తం 16 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మూడవ మ్యాచ్‌లో సూర్య పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని ఫ్యాన్స్ ఊహించారు. కానీ అది జరగలేదు.

ముంబై బ్యాటింగ్ సమయంలో సూర్య 16వ ఓవర్ చివరి బంతికి ముఖేష్ కుమార్ ట్రాప్ లో చిక్కుకోగా, కుల్దీప్ యాదవ్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. సూర్య మొదటి బంతిని డీప్ ఫైన్ లెగ్ దిశలో కొట్టాడు. కానీ కుల్దీప్ అద్భుతమైన క్యాచ్‌ను పట్టుకున్నాడు. సూర్య ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. దీని తర్వాత సూర్యను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ఫీల్డింగ్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ కు గాయం

ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి వర్సెస్ ఎంఐ) ఇన్నింగ్స్ 17వ ఓవర్ నాలుగో బంతికి అక్షర్ పటేల్ లాంగ్ ఆన్ దిశగా బంతిని కొట్టాడు. అయితే ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ డీప్‌లో బంతిని పట్టుకోవడానికి ట్రై చేశాడు. కానీ బంతి అతని రెండు పళ్ల మధ్యకు వెళ్లి నోటికి, కంటికి తగిలింది. సూర్య గాయపడ్డాడు. ఆ తర్వాత ఫిజియో బృందం అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లింది.