Site icon HashtagU Telugu

Rohit Sharma: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కొన్ని మ్యాచ్ లకు రోహిత్ శర్మ దూరం..!

Rohit Sharma

Rohit sHarma

IPL 2023 ప్రారంభం కానుంది. కానీ ముంబై ఇండియన్స్ జట్టు కష్టాలు తీరడం లేదు. ఐపీఎల్ 2023కి ముందు ముంబై ఇండియన్స్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సీజన్‌లోని కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తల ప్రకారం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ IPL 2023 సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడడు. అయితే రోహిత్ శర్మ గైర్హాజరీలో ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

రోహిత్ శర్మ స్థానంలో సూర్యకుమార్ యాదవ్

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తల ప్రకారం.. పని భారాన్ని తగ్గించడానికి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ముంబై ఇండియన్స్ అభిమానులకు శుభవార్త ఏమిటంటే రోహిత్ శర్మ గాయపడలేదు. అయితే పనిభారాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ శర్మ గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు బాధ్యతలు చేపట్టనున్నాడు. సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఈ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు, జ్యే రిచర్డ్‌సన్ గాయం కారణంగా మొత్తం సీజన్‌కు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్ విభాగం సమస్యగా మారింది.

Also Read: Ben Stokes: ఆ ఆల్ రౌండర్ బ్యాటింగ్ కే పరిమితం

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ అని గణాంకాలు చెబుతున్నాయి. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ కంటే ఎక్కువ సార్లు ఐపీఎల్ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకోలేదు. ముంబై ఇండియన్స్ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కెప్టెన్సీలో రోహిత్ శర్మ 2013 సంవత్సరంలో మొదటిసారి IPL టైటిల్‌ను గెలుచుకున్నాడు. దీని తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ IPL 2015, IPL 2017, IPL 2019, IPL 2020 టైటిల్స్ గెలుచుకుంది.

టోర్నీ పరిస్థితులను బట్టి రోహిత్ 5-7 మ్యాచ్‌లు దూరమయ్యే అవకాశాలున్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వారం రోజులకే టీమిండియా.. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ ఏడాదే భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీల నేపథ్యంలో భారత కీలక ఆటగాళ్లు గాయపడకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకోనుంది.