Suryakumar Yadav first post : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు ప్రస్తుతం చాలా మంచి కాలం నడుస్తోంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ క్యాచ్ అందుకుని.. భారత్ విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అక్కడి నుంచి అతడి గుడ్‌టైమ్ స్టార్ అయినట్లుగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో అనూహ్యంగా టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా నియమితులయ్యాడు.
ఈ క్రమంలో అతడికి సోషల్ మీడియా వేదికగా పలువురు మాజీ క్రికెటర్లు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లంక పర్యటనతో కెప్టెన్‌గా సూర్యకుమార్ బాధ్యతలను స్వీకరించనున్నాడు. కాగా.. కెప్టెన్‌గా అతడి పేరును ప్రకటించిన తరువాత సూర్యకుమార్ తొలిసారి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. గత కొన్ని వారాలుగా అంతా తనకు ఓ కలలా ఉందని అన్నాడు. తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మద్దతుగా నిలుస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు.
Also Read : T20 Captain Issue: హార్దిక్ కు వెన్నుపోటు పొడిచింది ఎవరు?
టీమ్ఇండియా తరుపున ఆడటాన్ని ఎల్లప్పుడూ గొప్ప గౌరవంగా భావిస్తానని, దాన్ని మాట్లల్లో వర్ణించలేన్నాడు. కొత్త పాత్రను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇక పై నుంచి నా పై చాలా బాధ్యత ఉంటుంది. ఇక ఎప్పటిలాగానే మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను అని సూర్యకుమార్ అన్నాడు. తనపై ఆ దేవుడి దయ సైతం ఉందని చెప్పాడు.