SKY: త్వరలోనే టెస్టు క్రికెట్ లో ఎంట్రీ ఇస్తా

షార్ట్ ఫార్మాట్ లో దుమ్ము రేపుతున్న టీమిండియా మిస్టర్ 360 త్వరలోనే టెస్ట్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తానంటున్నాడు. గతంలో రెండు సార్లు టెస్టుల్లో భారత జట్టుకు ఎంపికైనప్పటికీ..

  • Written By:
  • Updated On - November 21, 2022 / 03:36 PM IST

షార్ట్ ఫార్మాట్ లో దుమ్ము రేపుతున్న టీమిండియా మిస్టర్ 360 త్వరలోనే టెస్ట్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తానంటున్నాడు. గతంలో రెండు సార్లు టెస్టుల్లో భారత జట్టుకు ఎంపికైనప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. కాగా న్యూజిలాండ్‌తో రెండో టీ20లో సెంచరీ ఇన్నింగ్స్ పై సంతోషంగా ఉన్న సూర్య కుమార్ తన మనసులో మాటను బయటపెట్టాడు. త్వరలోనే భారత టెస్టు జట్టులోకి వస్తానని వ్యాఖ్యానించాడు.
తన ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌ను రెడ్‌ బాల్‌తో ప్రారంభించిన విషయాన్ని సూర్య కుమార్ గుర్తు చేశాడు. ముంబై జట్టు తరపున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాననీ, టెస్టు ఫార్మాట్‌ గురించి పూర్తి అవగాహన ఉందన్నాడు..టెస్టు క్రికెట్‌ ఆడటం తనకు చాలా ఇష్టమన్న సూర్య కుమార్ యాదవ్ తర్వలోనే టెస్ట్ క్యాప్‌ను అందుకుంటానని ఆశిస్తున్నట్టు చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్య కుమార్‌ యాదవ్‌ సెంచరీతో రెచ్చిపోయాడు. కేవలం 49 బంతుల్లోనే శతకం సాధించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. సూర్య టీట్వంటీ కెరీర్‌లో ఇది రెండో సెంచరీ. ప్రస్తుతం సూర్య కుమార్ ఐసీసీ టీట్వంటీ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు.