Suryakumar Yadav: బంగ్లాతో టెస్టు సిరీస్‌.. జట్టులోకి సూర్య..?

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - November 23, 2022 / 04:28 PM IST

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. మోకాలి గాయంతో బాధపడుతున్న ఆల్‌రౌండర్ జడేజా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో.. బంగ్లాదేశ్ టూర్‌‌కు దూరమయ్యే అవకాశం ఉంది. జడేజా గైర్హాజరీ నేపథ్యంలో బౌలింగ్‌ విభాగంలో స్పిన్నర్‌ కావాలనుకుంటే సౌరభ్‌ కుమార్‌కు, బ్యాటింగ్‌ ఆప్షన్‌ కోసం వెదికినట్లయితే.. సూర్యకుమార్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం.

వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. డిసెంబర్ 4 నుంచి బంగ్లాదేశ్ టూర్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆతిథ్య జట్టుతో జరిగే టెస్టు సిరీస్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇవ్వవచ్చని కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న డాషింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో సూర్యకుమార్ ఆడే ఛాన్స్ ఉంది.

భారత జట్టు న్యూజిలాండ్‌ పర్యటనలో ఉంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. ఇరు జట్లు (భారత్ వర్సెస్ న్యూజిలాండ్) నవంబర్ 25న వన్డే సిరీస్‌ను ప్రారంభించనున్నాయి. ఆ తర్వాత భారత్ బంగ్లాదేశ్ బయలుదేరుతుంది. బంగ్లాదేశ్‌తో టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇదిలా ఉంటే, భారత జట్టు యువ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ కెరీర్‌కు సంబంధించి చాలా చర్చనీయాంశంగా మారింది.

బంగ్లాదేశ్‌తో డిసెంబర్ 14 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా డిసెంబర్ 4 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచకప్ తర్వాత బీసీసీఐ తక్షణమే అమల్లోకి వచ్చేలా పాత సెలక్టర్లందరినీ తొలగించింది. అటువంటి పరిస్థితిలో కొత్త సెలక్షన్ కమిటీ సూర్యని లాంగ్ ఫార్మాట్‌లో ఆడించవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. 2022 ప్రారంభంలో శ్రీలంకతో టీమిండియా టెస్టు సిరీస్ ఆడింది. ఆ సమయంలో సౌరవ్ కుమార్ జట్టులోకి వచ్చాడు. అయితే అతనికి జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం ఇవ్వలేదు. బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఇక ఈ ఇద్దరు ఆటగాళ్లలో ఎవరిని ఇక ఫార్మాట్‌లోకి తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.