Suryakumar Yadav: ముంబై ఇండియ‌న్స్‌కు సూర్యకుమార్ యాద‌వ్‌ ఎందుకు ముఖ్యం..?

MI తన చివరి 3 మ్యాచ్‌లలో సూర్యకుమార్ యాదవ్‌ (Suryakumar Yadav)ను చాలా మిస్ అయ్యింది. అయితే, నాలుగో మ్యాచ్‌కు ముందు MIకి శుభవార్త వెలువడింది. టీ20లో నంబర్-1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ లీగ్‌లోకి వస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - April 4, 2024 / 07:45 PM IST

Suryakumar Yadav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024)లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఇప్పటివరకు చాలా నిరాశపరిచింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఇప్పటి వరకు ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది. MI తన చివరి 3 మ్యాచ్‌లలో సూర్యకుమార్ యాదవ్‌ (Suryakumar Yadav)ను చాలా మిస్ అయ్యింది. అయితే, నాలుగో మ్యాచ్‌కు ముందు MIకి శుభవార్త వెలువడింది. టీ20లో నంబర్-1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ లీగ్‌లోకి వస్తున్నాడు. ఎంఐకి సూర్యకుమార్ ఎందుకు ముఖ్యం? ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

ముంబైకి సూర్య ఎందుకు ముఖ్యం?

ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ వెన్నెముక. అతను లేకపోవడంతో MI మిడిల్ ఆర్డర్ చాలా బలహీనంగా ఉంది. టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తర్వాత నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ బ్యాటింగ్‌కు వస్తున్నారు. సూర్య పునరాగమనం జట్టు మిడిల్ ఆర్డర్‌ను బాగా బలోపేతం చేస్తుంది. మిడిలార్డర్‌లో వేగంగా పరుగులు చేయడమే కాకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోగలడు. అతనికి ఐపీఎల్‌లో 139 మ్యాచ్‌ల అనుభవం ఉంది. స్కై తన వింత షార్ట్‌తో బౌలర్ల ప్లాన్‌లను సైతం చెడ‌గొట్ట‌గ‌ల‌డు.

Also Read: Gold & Silver: చుక్కులు చూపిస్తున్న బంగారం ధ‌ర‌లు.. రూ. 70 వేలు దాటిన గోల్డ్ రేట్‌..!

ఐపీఎల్‌లో సూర్య ప్రదర్శన

లీగ్‌లో సూర్య ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే.. అతను ఇప్పటివరకు ఆడిన 139 మ్యాచ్‌లలో 32.17 సగటుతో, 143.32 స్ట్రైక్ రేట్‌తో 3249 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 21 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో సూర్యకుమార్ యాదవ్ అత్యధిక స్కోరు 103 పరుగులు. గత సీజన్‌లోనూ స్కై బ్యాట్ అద్భుతంగా రాణించింది. IPL 2023లో సూర్యకుమార్ 43.21 సగటుతో 605 పరుగులు, 181.14 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌ను సాధించాడు. గత సీజన్‌లో స్కై 5 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ సాధించాడు.

We’re now on WhatsApp : Click to Join

క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. సూర్య ఏప్రిల్ 4న ఎంఐలో చేరనున్నాడు. ఇప్పటి వరకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాసం పొందాడు. ఇప్పుడు జ‌ట్టులోకి రావడానికి రెడీ అవుతున్నాడు. ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తిరిగి రావచ్చు. సూర్యకుమార్ యాదవ్ ఆరోగ్యంపై ఫ్రాంఛైజీ ఇంకా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.