Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఇంగ్లాండ్‌తో ఆడిన 5 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో పాల్గొన్న తర్వాత ఇప్పుడు రంజీల్లో తన సొంత జట్టు ముంబై తరపున పాల్గొంటున్నాడు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 8 నుంచి కోల్‌కతాలో ముంబై, హర్యానా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని అంతా భావించారు. కానీ ఇది జరగలేదు. నిరాశపరిచే ఇన్నింగ్స్ ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సూర్య తన గత 10 ఇన్నింగ్స్‌లలో నిరాశపరుస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ 2025కి ముందు ముంబై ఇండియన్స్‌లో టెన్షన్ పెరిగింది.
సూర్య ఫ్లాప్ షో
ముంబై వర్సెస్ హర్యానా మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తన పేలవ ఫామ్‌ను మరోసారి కొనసాగించాడు. 5 బంతుల్లో 9 పరుగులు చేసి యువ బౌలర్ సుమిత్ కుమార్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే సూర్యకి ఇది కొత్తేమీ కాదు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో సూర్య సరైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ఇప్పుడు రంజీ ట్రోఫీలోనూ అదే పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతని పేలవమైన ఫామ్ ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఈ స్టార్ ప్లేయర్ తన గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇలాంటి పరిస్థితిలో సూర్య ఇటీవలి ఫామ్ IPL 2025కి ముందు ముంబై ఇండియన్స్‌ను ఆందోళనకు గురి చేస్తుంది.
Also Read: Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. సెమీస్‌కు చేరే జట్లు ఇవే?
Suryakumar Yadav has been clean bowled by Sumit Kumar in Ranji Quarters.
Mumbai reeling at 29/4pic.twitter.com/eqOq08HB8v
— CricketGully (@thecricketgully) February 8, 2025
గత 10 ఇన్నింగ్స్‌ల్లో నిరాశపరుస్తున్న సూర్య
ముందుగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో సూర్య గురించి చెప్పాలంటే.. అతను 2,0,14,12, 0 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌కు ముందు విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన 4 ఇన్నింగ్స్‌లలో 0,0, 18, 20 పరుగులు చేశాడు. ఇప్పుడు హర్యానాతో జరుగుతున్న మ్యాచ్‌లో అతడి బ్యాట్ నుంచి 9 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై పలు ప్రశ్నలు వస్తున్నాయి.
హర్యానా పటిష్ట స్థితిలో ఉంది
ముంబై, హర్యానా జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై మొదట బ్యాటింగ్ చేస్తోంది. 28 ఓవర్లలో ముంబై పరిస్థితి దారుణంగా ఉంది. ఆ జట్టులోని 7 మంది ప్రధాన బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్‌కు చేరుకున్నారు. ఈ వార్త రాసే సమయానికి ముంబై 52 ఓవర్లలో 202/7 పరుగులు మాత్రమే చేసింది. సూర్యతో పాటు కెప్టెన్ అజింక్యా రహానే, శివమ్ దూబే కూడా నిరాశపర్చారు. దూబే 28 పరుగులు చేయగా, రహానే 31 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు హర్యానా నుంచి అన్షుల్ కాంబోజ్ 3 వికెట్లు తీయగా, సుమిత్ కుమార్ 2 వికెట్లు తీసి ముంబైని కట్టడి చేశారు.