SKY: ఈ S.K.Y కి ఆకాశమే హద్దు

  • Written By:
  • Publish Date - September 28, 2022 / 11:06 PM IST

సూర్య కుమార్ యాదవ్…అభిమానులు ముద్దుగా SKY అని పిలుచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఈ స్టార్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ ట్వంటీ లో రెచ్చిపోయిన సూర్య కుమార్ యాదవ్ తాజాగా సఫారీ టీమ్ పై తొలి మ్యాచ్ లో అదరగొట్టాడు. హాఫ్ సెంచరీతో దుమ్ము రేపాడు. ఈ క్రమంలో పలు రికార్డులు క్రియేట్ చేశాడు. సౌతాఫ్రికాతో తొలి టీ ట్వంటీలో సూర్య కుమార్ 5 ఫోర్లు , 3 సిక్సర్లతో 50 రన్స్ చేశాడు. దీంతో ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ యేడాది ఇప్పటి వరకూ సూర్య 732 రన్స్ చేయగా…గతంలో ధావన్ 689, కోహ్లీ 641 పరుగుల రికార్డును అధిగమించాడు. అలాగే ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకూ సూర్య కుమార్ యాదవ్ 45 సిక్స్ లు కొట్టాడు. గతంలో ఒక క్యాలెండర్ ఇయర్ లో రిజ్వాన్ 42, గప్తిల్ 41 సిక్సర్లు కొట్టారు.

గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న సూర్య కుమార్ తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో అదరగొట్టాడు. ఐసీసీ రిలీజ్‌ చేసిన ర్యాంకుల్లో సూర్య రెండో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. రేటింగ్‌ పాయింట్స్‌ కూడా 800 దాటడంతో ఇప్పుడు నంబర్‌ వన్‌ ర్యాంక్‌కు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ అగ్ర స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా తో సీరీస్ లో కూడ
సూర్య కుమార్ యాదవ్ ఇదే ఫామ్ కొనసాగిస్తే టీ ట్వంటీ వరల్డ్ కప్ లోపే సూర్య కుమార్ యాదవ్ టాప్ ర్యాంకును దక్కిచుకోవచ్చు.