Site icon HashtagU Telugu

IPL 2023: సూర్యకుమార్ పై దాదా ట్వీట్ వైరల్

IPL 2023

Ipl 2023 (2)

IPL 2023: బిసిసిఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై ముంబై విజయం సాధించింది. ఈ ఇన్నింగ్స్ లో సూర్య కుమార్ యాదవ్ దుమ్ముదులిపాడు.

సూర్యకుమార్ IPL 2023లో కొన్ని మ్యాచ్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. 32 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ గత ఐదు మ్యాచ్‌ల్లో మూడు అర్ధశతకాలు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో 11 మ్యాచ్‌లలో 34.18 సగటుతో మరియు 186.14 స్ట్రైక్ రేట్‌తో 376 పరుగులు చేశాడు.

మంగళవారం ఆర్‌సీబీపై సూర్యకుమార్ మరోసారి తన సత్తా చాటాడు. ఒకే ఓవర్లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరి వికెట్లు కోల్పోవడంతో సూర్య మైదానంలోకి వచ్చాడు. సూర్యకుమార్ నెహాల్ వధేరాతో కలిసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి కేవలం 35 బంతుల్లో 83 పరుగులు చేశాడు. సూర్య ఐపీఎల్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ స్కోరు. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కాగా ఈ ఇన్నింగ్స్ లో సూర్య ప్రదర్శనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ,సూర్యకుమార్ స్కై ఇన్నింగ్స్‌పై సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ట్విటర్‌లో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ సూర్యకుమార్ ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 ఆటగాడిగా అభివర్ణించారు. ఎంఐ స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్య కంప్యూటర్‌లో బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపిస్తోందని గంగూలీ ట్వీట్ చేశాడు.

Read More: Each mango 19000 : ఒక్కో మ్యాంగో రూ.19,000.. ఎక్కడ, ఎందుకు, ఎలా ?