Site icon HashtagU Telugu

SuryaKumar Yadav: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ‌రో సంచలన నిర్ణయం!

Surya Kumar Yadav

Suryakumar Yadav

SuryaKumar Yadav: ఏసీసీ ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ఇక ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు మూడోసారి తలపడనున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav) ఒక సంచలన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నిర్ణయంతో ఆయన సల్మాన్ అలీ ఆగాకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని కూడా బద్దలు కొట్టారు.

సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న సంచలన చర్య

ప‌లు నివేదికల ప్రకారం.. ఫైనల్‌కు ముందు జరిగే ట్రోఫీ ఫోటోషూట్‌లో పాల్గొనకూడదని భారత జట్టు నిర్ణయించుకుంది. దీని కారణంగా సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ అలీ ఆగా ఇద్దరూ ట్రోఫీతో కలిసి ఫోటో దిగడం జరగదు.

Also Read: Nepal Former PM: నేపాల్‌లో నిర‌స‌న‌లు.. మాజీ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఈ టోర్నమెంట్‌ మొత్తంలో భారత జట్టు పాకిస్తాన్‌కు పలు సందర్భాల్లో గట్టిగా బుద్ధి చెప్పింది. మొదటి మ్యాచ్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు హ్యాండ్‌షేక్ చేసుకోలేదు. అంతేకాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల మధ్య హ్యాండ్‌షేక్ జరగలేదు. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. రెండో మ్యాచ్ సందర్భంగా కూడా పాకిస్థాన్ ఆటగాళ్లు పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించారు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌కు ముందు కూడా మళ్లీ ఈ వివాదం ప్రారంభమైంది.

రేపే భార‌త్‌- పాక్ ఆసియా క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌

ఏసీసీ ఆసియా క‌ప్ 2025 ఫైనల్ మ్యాచ్‌ రేపు అంటే సెప్టెంబర్ 28న (ఆదివారం) నాడు జరగనుంది. ఈ ముఖ్యమైన మ్యాచ్‌ దుబాయ్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో రెండు జట్లు తలపడటం ఇది మూడోసారి. భారత జట్టు ఈసారి కూడా పాకిస్తాన్‌ను ఓడించి, టైటిల్‌ను గెలుచుకోవాలనే ధీమాతో ఉంది. పాక్ కూడా భార‌త్‌ను ఓడించి టైటిల్ గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది.

Exit mobile version