Site icon HashtagU Telugu

Surya Kumar Yadav: సూర్య కుమార్ యాదవ్ @ 2

Surya Kumar Yadav

Surya Kumar Yadav

Surya Kumar Yadav: షార్ట్ ఫార్మాట్ లో ప్రస్తుతం టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ హవా కొనసాగుతోంది. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న సూర్య కుమార్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో అదరగొట్టాడు. తాజాగా ఐసీసీ రిలీజ్‌ చేసిన ర్యాంకుల్లో సూర్య రెండో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. రేటింగ్‌ పాయింట్స్‌ కూడా 800 దాటడంతో ఇప్పుడు నంబర్‌ వన్‌ ర్యాంక్‌కు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ అగ్ర స్థానంలో ఉన్నాడు.

ఇక సూర్య తర్వాత మూడోస్థానంలోనూ మరో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం కొనసాగుతున్నాడు. ఇదిలాఉండగా ఈ ముగ్గురి మధ్య పోటీ రాబోయే రోజుల్లో కూడా కొనసాగునుంది. సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ లు ఆడనున్నాడు. కాగా అద్భుత ఫామ్‌లో ఉన్న సూర్య కుమార్ కు ఇదే కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్. ఇటీవల ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్య అద్భుతంగా రాణించాడు.

మరోవైపు టీమిండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లి ఒక స్థానం మెరుగుపరచుకుని 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 13వ స్థానంలో ఉన్నాడు. అటు బౌలర్ల ర్యాంకింగ్స్ లో భారత్ స్పిన్నర్లు స్థానాలు మెరుగయ్యాయి.అక్షర్‌ పటేల్‌ 33వ ర్యాంక్‌ నుంచి 18కి, చహల్‌ 28 నుంచి 26కు చేరుకున్నారు. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా పేస్‌బౌలర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ టాప్‌లో కొనసాగుతున్నాడు.

Exit mobile version