Site icon HashtagU Telugu

India 1st Innings: కోహ్లీ, సూర్యకుమార్ మెరుపులు…భారత్ 192/2

Surya Imresizer

Surya Imresizer

ఆసియాకప్‌ రెండో మ్యాచ్‌లో భారత భారీస్కోరు చేసింది. హాంకాంగ్‌ బౌలర్లను ఆటాడుకున్న టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి హాంకాంగ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే భారత తుది జట్టులో మార్పు జరిగింది. ఎవరూ ఊహించని విధంగా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చింది. అతని స్థానంలో రిషబ్ పంత్‌కు చోటు కల్పించింది.

తర్వాత మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకునే రెస్ట్ ఇచ్చినట్టు కోహ్లీ చెప్పాడు. ఓపెనర్లు రాహుల్, రోహిత్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్‌కు 38 పరుగులు జోడించారు. రోహిత్‌శర్మ 21 , కెఎల్ రాహుల్ 36 పరుగులు చేయగా…ఆ తర్వాత కోహ్లీ, సూర్యకుమార్ ధాటిగా ఆడారు. చాలా కాలం తర్వాత పూర్తి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీతో కాన్ఫిడెన్స్ పెంచుకున్న విరాట్‌ 59 పరుగులు చేశాడు. అయితే భారత్ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగే హైలెట్‌గా చెప్పాలి.

ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ సిక్సర్ల వర్షం కురిపించాడు. హాంకాంగ్ బౌలర్లపై విరుచుకుపడిన సూర్య కేవలం 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. కోహ్లీ 44 బంతుల్లో 1 ఫోర్ , 3 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో 15 ఓవర్లకు భారత్ 114 పరుగులు చేయడంతో స్కోర్ 160 చేరుతుందనిపించింది. అయితే సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ చివరి ఐదు ఓవర్లలో 78 పరుగులు చేసింది.