Site icon HashtagU Telugu

Suresh Raina: రైనాకు అరుదైన గౌరవం

Raina

Raina

టీమిండియా మాజీ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ సురేశ్ రైనాకు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా అతన్ని మల్దీవులు ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘స్పోర్ట్స్ ఐకాన్’ అవార్డుకు ఎంపిక చేసింది. మార్చి 17న మల్దీవ్స్ సోర్ట్స్ అవార్డ్స్ 2022 ఈవెంట్ సింథటిక్‌ రన్నింగ్‌ ట్రాక్‌ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ క్రీడాశాఖ మంత్రి జహీర్ హసన్ రసెల్ చేతుల మీదుగా స్పోర్ట్స్ ఐకాన్ అవార్డును సురేశ్ రైనా అందుకున్నాడు. మల్దీవులు ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘స్పోర్ట్స్ ఐకాన్’ అవార్డు కోసం మొత్తం 16 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పోటీపడ్డారు..

వీరిలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య, డచ్ ఫుట్‌బాల్ లెజెండ్ ఎడ్గర్ డెవిడ్స్, , ఫుట్‌బాల్ ప్లేయర్ రాబర్ట్ కార్లోస్, జమైకా స్పింటర్ అసాఫా పావెల్ తదితరులు ఉన్నారు. అయితే వీరందరిని వెనక్కినెట్టి స్పోర్ట్స్ ఐకాన్ అవార్డు సురేశ్ రైనా దక్కించుకున్నాడు… ఇక ఐపీఎల్‌ 2022 మెగావేలంలో రైనాను ఎవరు కొనడానికి ఆసక్తి చూపలేదు. దీంతో రైనా అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. ఇక ఐపీఎల్​లో మొత్తం 205 మ్యాచ్​లు ఆడిన రైనా 5528 పరుగులు చేశాడు.అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున 176 మ్యాచ్​లు ఆడిన సురేశ్​ రైనా.. 32.32 సగటుతో 4687 పరుగులు చేశాడు.