Suresh Raina: రీ ఎంట్రీ ఇస్తున్న సురేష్ రైనా.. ఏ లీగ్ లో ఆడుతున్నాడంటే..

ఒకప్పుడు టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ప్లేయర్ గా ఉన్న సురేష్ రైనా మరోసారి క్రికెట్ ఫీల్డ్ లో అడుగు పెట్టబోతున్నాడు. ఈసారి ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఉత్తర ప్రదేశ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

Suresh Raina: ఒకప్పుడు టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ప్లేయర్ గా ఉన్న సురేష్ రైనా మరోసారి క్రికెట్ ఫీల్డ్ లో అడుగు పెట్టబోతున్నాడు. ఈసారి ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఉత్తర ప్రదేశ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అయితే ఈ టీమ్ కు కూడా రైనా ఎల్లో జెర్సీలో బరిలోకి దిగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పిన తర్వాత రైనా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించారు. మిస్టర్ ఐపీఎల్ గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే రైనా ఈ మెగా లీగ్ లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అలాంటి ప్లేయర్ ఇప్పుడు ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా యూపీ జట్టుకు ఆడుతున్నాడు.

టీ ట్వంటీ ఫార్మాట్ లో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడిగా పేరుగాంచిన రైనా.. తాను ఐవీపీఎల్లో ఆడుతున్న విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించాడు.ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ లో భాగం పంచుకుంటున్నందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉందన్నాడు. వెటరన్ క్రికెటర్లు ఆడేందుకు ఇదొక చక్కని అవకాశమన్నాడు. ఈ వీవీఐపీ ఉత్తర ప్రదేశ్ లో రైనాతోపాటు ఆస్ట్రేలియా టీమ్ మాజీ ఆల్ రౌండర్ డాన్ క్రిస్టియన్ కూడా ఆడనున్నాడు. ఐవీపీఎల్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 మధ్య డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ ఐవీపీఎల్ ద్వారా ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ ను శాసించిన సెహ్వాగ్, క్రిస్ గేల్, యూసుఫ్ పఠాన్, హెర్షలీ గిబ్స్ లాంటి ఎందరో మాజీలు మళ్లీ ఫీల్డ్ లో కనిపించనున్నారు.

Also Read: Condom Day 2024 : రేపు వాలెంటైన్స్ డే.. ఇవాళే కండోమ్స్ డే.. ఎందుకలా ?