Site icon HashtagU Telugu

Suresh Raina Requests BCCI: బీసీసీఐకి సురేష్ రైనా స్పెష‌ల్ రిక్వెస్ట్.. రోహిత్‌, విరాట్ జెర్సీల‌ను కూడా..!

BCCI Central Contract

BCCI Central Contract

Suresh Raina Requests BCCI: T20 ప్రపంచ కప్ 2024 విజేత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. టోర్నమెంట్ మ్యాన్ ఆఫ్ ది “ఫైనల్” టైటిల్‌ను గెలుచుకున్న విరాట్ కోహ్లీ అంతర్జాతీయ T20 క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. ఛాంపియన్‌గా నిలిచిన వీరిద్దరూ రిటైర్మెంట్‌ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. భారత క్రికెట్ జట్టు అభిమానులు ఈ ఇద్దరు ఆటగాళ్లను మరింత ఎక్కువగా ఆడాలని కోరుకున్నారు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్ నిర్ణయంపై అభిమానులతో పాటు మాజీ క్రికెట్ ఆటగాళ్ల నుండి కూడా స్పందనలు వస్తున్నాయి. మరోవైపు మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా వీరిద్ద‌రికి సంబంధించి బీసీసీఐ (Suresh Raina Requests BCCI)కి ఓ ప్రత్యేక డిమాండ్ చేశాడు.

బీసీసీఐని రైనా ఏం అడిగాడు

భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా జియో సినిమాతో మాట్లాడుతూ.. జెర్సీ నంబర్-18, జెర్సీ నంబర్-45ని రిటైర్ చేయమని నేను బీసీసీఐని అభ్యర్థిస్తున్నాను. బీసీసీఐ ఈ జెర్సీలను తన కార్యాలయంలో ఉంచుకోవాలి. బీసీసీఐ ఇప్పటికే జెర్సీ నంబర్ 7ను రిటైర్డ్ చేసింది. BCCI జెర్సీ నంబర్ 18, జెర్సీ నంబర్ 45 కోసం అదే చేయాలి. కొత్త క్రికెటర్లు ఈ జెర్సీలను స్ఫూర్తిగా తీసుకుంటారు. ఈ రెండు జెర్సీలు అనేక సందర్భాల్లో టీమ్‌ఇండియాను విజయతీరాలకు చేర్చాయి. క్రికెట్ రంగంలోకి వస్తున్న కొత్త వ్యక్తులు ఈ జెర్సీలను చూసి స్ఫూర్తి పొందాలని ఆయ‌న పేర్కొన్నారు. ఈ చర్చలో భారత మాజీ ఓపెనర్ అభినవ్ ముకుంద్ కూడా ఉన్నాడు. సురేశ్ రైనా డిమాండ్‌కు ఆయన కూడా మద్దతు పలికారు.

Also Read: Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదేనా..?

రోహిత్-విరాట్ జెర్సీ నంబర్ ఎంత?

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ జెర్సీ నంబర్ 45. అదే సమయంలో విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18. ఈ రెండు జెర్సీలను రిటైర్ చేయాలని సురేష్ రైనా బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.

బీసీసీఐ ఇప్పటి వరకు ఎన్ని జెర్సీలకు రిటైర్మెంట్ ఇచ్చింది?

బీసీసీఐ ఇప్పటి వరకు కేవలం 2 జెర్సీలను మాత్రమే రిటైర్ చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ పదవీ విరమణ చేసిన మూడేళ్ల తర్వాత అతనికి గౌరవ సూచకంగా BCCI అతని జెర్సీ నంబర్ 7ని రిటైర్ చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా భారత్‌ను రెండుసార్లు ప్రపంచకప్ ట్రోఫీని అందించాడు. గతంలో 2017లో సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్-10ని బీసీసీఐ శాశ్వతంగా రిటైర్ చేసింది.

We’re now on WhatsApp : Click to Join