Site icon HashtagU Telugu

Suresh Raina: లంక ప్రీమియర్ లీగ్ వేలంలో సురేశ్ రైనాకు అవమానం.. ఏం జరిగిందంటే..?

Suresh Raina

Suresh Raina

Suresh Raina: లంక ప్రీమియర్ లీగ్ (Lanka Premier League)లో తొలిసారిగా ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించారు. జూన్ 14న జరిగిన ఆటగాళ్ల వేలంలో ప్రపంచ క్రికెట్‌లోని పలువురు దిగ్గజ ఆటగాళ్ల పేర్లు వినిపించాయి. భారత్‌కు చెందిన ఏకైక ఆటగాడిగా సురేష్ రైనా (Suresh Raina) ఈ వేలంలో పాల్గొన్నాడు. అతడిని 11వ సెట్‌లో చేర్చారు. అయితే వేలం నిర్వాహకుడు చారు శర్మ.. రైనా పేరును పిలవకపోవడంతో అభిమానులతో పాటు అందరూ అయోమయంలో పడ్డారు. సురేశ్ రైనా పేరు ఎందుకు పిలవలేదనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

సురేశ్ రైనా పేరును పిలవకపోవడంపై సోషల్ మీడియాలో అభిమానుల్లో కూడా చర్చనీయాంశమైంది. ఇందులో కొంతమంది అభిమానుల ప్రకారం.. శ్రీలంక క్రికెట్ తమ బ్రాండ్‌కు ప్రమోషన్‌ను పొందేందుకు ఉద్దేశపూర్వకంగానే ప్లేయర్ వేలం కోసం సురేష్ రైనా పేరును ఎంచుకుంది. అయితే ఇప్పటి వరకు ఇవన్నీ ఊహాజనితాలు మాత్రమే. ఈ విషయంలో సురేశ్ రైనా లేదా శ్రీలంక క్రికెట్ నుంచి కొన్ని ప్రకటనలు వచ్చిన తర్వాతే పరిస్థితి తేలనుంది.

Also Read: Rishabh Pant: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. కోలుకుంటున్న రిషబ్ పంత్.. వీడియో వైరల్..!

ఐపీఎల్ తరహాలో తొలిసారిగా శ్రీలంక క్రికెట్ తన టీ20 లీగ్ కోసం ఆటగాళ్ల వేలాన్ని నిర్వహించింది. ఇందులో మొత్తం 360 మంది ఆటగాళ్లు ఉండగా ఇందులో సురేష్ రైనా పేరు కూడా ఉంది. రైనా ప్రపంచ క్రికెట్‌లో T20 ఫార్మాట్‌లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పరిగణించబడ్డాడు. రైనా ఇప్పటి వరకు 250కి పైగా టీ20 మ్యాచ్‌లు ఆడాడు. లంక ప్రీమియర్ లీగ్ చివరి సీజన్‌లో భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ పాల్గొన్నాడు.

లంక ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్ జూలై 31 నుండి ప్రారంభం

లంక ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్ జూలై 31 నుండి ప్రారంభం కానుంది. ఇందులో పాక్ జట్టు ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు వాహబ్ రియాజ్ లాంటి ఎందరో గొప్ప ఆటగాళ్లు కనిపించనున్నారు.