Modi Congrats Indian Team: టీమిండియాకు మోదీ అభినందనలు

ఆసియా కప్ ఆరంభ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాక్ పై భారీ విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Jadeja And Pandya

Jadeja And Pandya

ఆసియా కప్ ఆరంభ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాక్ పై భారీ విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే హైదరాబాద్ తో పాటు పలు ప్రధాన నగరాల్లో క్రికెట్ ఫాన్స్ జాతీయ జెండాలు పట్టుకుని రోడ్లపై కలియ తిరిగారు.

మరోవైపు భారత్ క్రికెట్ జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు టీమిండియాకు అభినందన తెలిపారు. విజయం అనంతరం మోదీ భారత ఆటగాళ్లకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారత్ ఈ రోజు అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది. గొప్ప నైపుణ్యం కనబరిచింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు. దాయాదుల సమరంలో భాగంగా మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ 147 పరుగులకే ప్రత్యర్థి జట్టును పరిమితం చేసింది.

ఆ తర్వాత 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. కాస్త కంగారు పడ్డా… హార్దిక్ పాండ్య ఆల్ రౌండ్ షోతో భారత్ గెలుపొందింది. తద్వారా గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఎదురయిన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

Pic Courtesy: BCCI twitter

  Last Updated: 29 Aug 2022, 09:56 AM IST