Site icon HashtagU Telugu

Asia Cup 2025: ఆసియా కప్‌లో సూపర్‌ ఓవర్‌ ఉంటుందా? బౌల్ ఔట్‌ ఉంటుందా?

Asia Cup

Asia Cup

Asia Cup 2025: ఆసియా కప్‌-2025 (Asia Cup 2025) సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా.. శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా భారత జట్టు బరిలోకి దిగనుంది. వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేశ్ శర్మలను ఎంపిక చేశారు. అయితే గాయం కారణంగా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ జట్టుకు దూరంగా ఉండనున్నాడు. ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ క్రమంలో ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే, విజేతను ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఆసియా కప్‌లో సూపర్‌ ఓవర్‌ ఉంటుందా? బౌల్ ఔట్‌ ఉంటుందా?

ఆసియా కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ మ్యాచ్ కూడా డ్రాగా ముగిసి.. విజేతను నిర్ణయించడానికి సూపర్‌ ఓవర్‌ లేదా బౌల్ ఔట్‌ను ఉపయోగించాల్సిన అవసరం రాలేదు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో బౌల్ ఔట్‌ విధానాన్ని 2008లో రద్దు చేశారు. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే దాని స్థానంలో సూపర్‌ ఓవర్‌ను నిర్వహించే నిబంధనను ఐసీసీ ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సూపర్‌ ఓవర్‌ 2008 డిసెంబర్ 26న న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగింది. కాబట్టి ఆసియా కప్ 2025లో ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే, విజేతను సూపర్‌ ఓవర్‌ ద్వారానే నిర్ణయిస్తారు అనేది స్పష్టమవుతోంది.

Also Read: Tamil Pilot: అందరికీ నమస్కారం.. తమిళ పైలట్ అనౌన్స్‌మెంట్ వీడియో వైర‌ల్‌!

సూపర్‌ ఓవర్‌ కూడా డ్రా అయితే?

ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒకవేళ మ్యాచ్‌ డ్రా అయిన తర్వాత సూపర్‌ ఓవర్‌ కూడా డ్రాగా ముగిస్తే, మరో సూపర్‌ ఓవర్‌ను నిర్వహిస్తారు. ఈ విధంగా విజేత తేలే వరకు సూపర్‌ ఓవర్లను నిర్వహిస్తూనే ఉంటారు.

సూపర్‌ ఓవర్‌ నియమాలు

సూపర్‌ ఓవర్‌లో ఇరు జట్లకు ఒక్కో ఓవర్ అదనంగా ఆడే అవకాశం లభిస్తుంది. ఈ ఓవర్‌లో రెండు జట్లు తమ 11 మంది ఆటగాళ్లలోంచి కేవలం నలుగురిని (ముగ్గురు బ్యాట్స్‌మెన్, ఒక బౌలర్) ఎంపిక చేసుకుంటాయి. సూపర్‌ ఓవర్‌లో ఏ జట్టు అయితే ఎక్కువ పరుగులు చేస్తుందో ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ ఆరు బంతులు పూర్తి కాకముందే రెండు వికెట్లు కోల్పోతే, ఆ జట్టు ఇన్నింగ్స్ అక్కడే ముగుస్తుంది. పూర్తి ఓవర్‌ ఆడే అవకాశం లభించదు.