Site icon HashtagU Telugu

RCB vs SRH: సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం… బెంగుళూరుపై ఘన విజయం

RCB vs SRH

RCB vs SRH

RCB vs SRH: ఐపీఎల్ 17వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. తన జోరును కొనసాగిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వారి సొంత గడ్డపై ఓడించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 రన్స్ తేడాతో విజయం సాధించింది.

ఇది కదా పరుగుల సునామీ అంటే… ఇది కదా సిక్సర్ల వర్షం అంటే… ఇది కదా బౌండరీల హోరు అంటే… ఒకటా రెండా 287 పరుగులు…అది కూడా 20 ఓవర్లలో…అందులో 22 సిక్సర్లు..ఇంతకంటే ఏం కావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎలా సాగిందో చెప్పడానికి. సహజంగానే చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ కు స్వర్గ ధామం…అలాంటి స్టేడియంలో ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ బ్యాటర్లు ఆగుతారా…బెంగుళూరు బౌలర్లపై విచక్షణ లేకుండా బ్యాట్ తో విరుచుకుపడ్డారు. బౌలర్ ఎవరైనా కొడితే గ్యాలరీలో పడాల్సిందే…ఇలా సాగింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్…ఈ మ్యాచ్ లో ట్రావిస్‌ హెడ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది. హెడ్ సెంచరీతో చెలరేగగా..క్లాసెన్‌ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మెరుపులు మెరిపించాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ తొలి ఓవర్ నుంచే భారీ షాట్లతో విరుచుకు పడ్డారు. తొలి వికెట్ కు వీరి పార్టనర్ షిప్ 8.1 ఓవర్లలో 108 పరుగులు. క్లాసెన్‌ వచ్చాక హెడ్ మరింత ధాటిగా ఆడాడు. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఈ ఆసీస్ క్రికెటర్ 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్లాసెన్‌ 31 బంతుల్లో 67 పరుగులు చేసాడు. హెడ్ 102 రన్స్ కు ఔట్ అవగా సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది.

We’re now on WhatsAppClick to Join

బ్యాటింగ్ పిచ్ కావడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా దూకుడుగా ఆడింది. కోహ్లీ , డూప్లేసిస్ తొలి వికెట్ కు 80 పరుగులు జోడించారు. అయితే మిడిలార్డర్ విఫలమవదం బెంగుళూరు పోరాటానికి బ్రేక్ వేసింది. ఆర్సీబీ వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. చివర్లో దినేష్ కార్తీక్ మెరుపులు బెంగుళూరు కు విజయాన్ని అందించకున్నా అభిమానులను అలరించాయి. డీకే మెరుపు ఇన్నింగ్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకి 262 పరుగులు చేసింది. దినేష్ కార్తీక్ 35 బంతుల్లో 83 పరుగులు చేశాడు. కాగా సన్ రైజర్స్ కు వరుసగా ఇది మూడో విజయం. అలాగే బెంగుళూరు టీమ్ కు ఇది ఆరో ఓటమి.

Also Read: RCB vs SRH: సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం… బెంగుళూరుపై ఘన విజయం