Site icon HashtagU Telugu

IPL 2022: నయా లుక్ లో సన్ రైజర్స్ జెర్సీ

Sunrisers Dress

Sunrisers Dress

త్వరలో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట‌గాళ్లు కొత్త జెర్సీల్లో క‌నిపించ‌నున్నారు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.. జెర్సీ కలర్‌ పాతదే అయినప్పటికి ఐపీఎల్ 2022 సీజన్ ను దృష్టిలో మరి కాస్త కొత్తగా తయారు చేశారు. ఆరెంజ్ కలర్‌లో ఉండే జెర్సీపై ముందుభాగంలో ఎల్లో కలర్ షేడ్స్‌ ఉన్నాయి. దానిపై సన్ రైజర్స్ హైదరాబాద్ స్పాన్సర్స్‌ అయిన ‘కార్స్ 24’ వైట్‌ కలర్‌లో కనిపిస్తాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ అనే అక్షరాలు ఆరెంజ్‌ కలర్‌లో దర్శనమిస్తుంది. మరో రెండు రోజుల్లో వేలం జరగనున్న నేపథ్యంలో సన్ రైజర్స్ యాజమాన్యం తమ కొత్త జెర్సీలను విడుదల చేసింది. కాగా రిటెన్షన్‌ ప్రక్రియలో ఆ జట్టు ముగ్గురు ఆటగాళ్ళను కొనసాగించనుంది. కేన్‌ విలియమ్సన్‌ ను రూ. 14 కోట్లు, అబ్దుల్‌ సమద్‌ ను రూ. 4 కోట్లు, ఉమ్రాన్‌ మలిక్‌ ను రూ. 4 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది. దీంతో ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీ దగ్గర . ఈ రూ. 68 కోట్లు మిగిలి ఉండగా… వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ కోసం వెచ్చించాలని భావిస్తోంది. ప్రస్తుతం వేలంలో అత్యధిక పర్స్ మనీ కలిగిన రెండో జట్టుగా సన్ రైజర్స్ నిలిచింది. అయితే గత కొన్ని సీజన్లుగా విదేశీ ఆటగాళ్లపై ఆధారపడ్డ ఆరెంజ్ ఆర్మీ ఈసారి ఆ తప్పిదం రిపీట్ చేయకూడదని భావిస్తోంది. అలాగే ప్రతీసారీ మిడిలార్డర్ పై పెద్దగా ఫోకస్ పెట్టని హైదరాబాద్ ఈ సారి వేలంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇదిలాఉంటే.. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్‌ చెత్త ప్రదర్శన కనబర్చింది. 14 మ్యాచ్‌లకు గానూ కేవలం 3 మ్యాచుల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలోఆఖరి స్థానంలో నిలిచింది.