Hyderabad Beats Mumbai: థ్రిల్లింగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం.. ముంబై చిత్తు!!

IPL2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.

Published By: HashtagU Telugu Desk
Sunrisers Hyderabad

Sunrisers

IPL2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరకు మూడు పరుగుల తేడాతో ముంబై ఓటమిపాలైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్…రాహుల్ త్రిపాఠీ 76, ప్రియమ్ గార్గ్ 42, పూరన్ 38 పరుగులతో రాణించడంతో 193 పరుగుల భారీ స్కోరు చేసింది. ముంబైకి లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ 48, ఇషాన్ కిషన్ 43 పరుగులతో శుభారంభం అందించారు.

వాళ్లు అందించిన శుభారంభాన్ని మిడిలార్డర్ ఉపయోగించుకోలేకపోయింది. డానియల్ శామ్స్ 15, తిలక్ వర్మ 8, ట్రిస్టన్ స్టబ్స్ 2 పరుగులతో విఫలమయ్యారు. చివర్లో టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 46 పరుగులు చేసి ముంబైని విజయంవైపు తిప్పాడు. కానీ అతను రనౌట్ అవడంతో సన్ రైజర్స్ కు కలిసి వచ్చింది. రమణ్ దీప్ సింగ్ 6 బంతుల్లో 14 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచినా…ఏం చేయలేకపోయాడు.

దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 7 వికెట్లు కోల్పోయి…190 పరుగులు మాత్రమే చేసింది. మూడు పరుగుల తేడాతో సన్ రైజర్స్ చేతిలో ఓడింది. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీయగా..భువనేశ్వర్ , వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు.

  Last Updated: 18 May 2022, 12:53 AM IST