Sachin Railway Station : సచిన్ పేరుతో రైల్వే స్టేషన్..ఎక్కడుందో..?

గుజ‌రాత్‌లోని సూర‌త్‌కు స‌మీపంలో స‌చిన్ రైల్వే స్టేష‌న్ ఉంది

Published By: HashtagU Telugu Desk
Sunil Gavaskar Visits Sachin Railway Station

Sunil Gavaskar Visits Sachin Railway Station

 

గొప్ప..గొప్ప వ్యక్తుల పేర్లను గ్రంధాలయాలు , స్టేడియం లకు , రోడ్స్ కు , బ్రిడ్జ్ లకు ఇలా పలువాటికి పెడుతుంటారు. అలాంటి గొప్ప వ్యక్తుల్లో సచిన్ (Sachin Tendulkar) ఒకరు. క్రికెట్ దేవుడిగా అంత కొలుస్తారు. రీసెంట్ గా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించి తన పేరును చిరస్థాయి చేసారు. అలాగే సచిన్ పేరు తో ఓ రైల్వే స్టేషన్ (Sachin Railway Station) కూడా ఉందని చాలామందికి తెలియదు..ఈ విషయాన్నీ తాజాగా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) తెలియజేసారు.

గుజ‌రాత్‌లోని సూర‌త్‌కు స‌మీపంలో స‌చిన్ రైల్వే స్టేష‌న్ ఉంది. గ‌త శ‌తాబ్ద‌పువాళ్ల‌ది ఎంత ముందుచూపో. క్రికెట్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌, నా ఫేవ‌రేట్ క్రికెట‌ర్, మ‌రీ ముఖ్యంగా నాకెంతో ఇష్ట‌మైన వ్య‌క్తి పేరును ఒక రైల్వే స్టేష‌న్‌కు పెట్టారు అని గ‌వాస్క‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. వన్డే క్రికెట్ ఫార్మాట్లో రికార్డు స్థాయిలో 49 శకాలు, 96 అర్ధ శతకాలు బాదిన మొదటి వ్యక్తి సచిన్ టెండుల్కర్ అని, వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసింది కూడా సచినే అని గవాస్కర్ తెలిపాడు. అలాంటి గ్రేట్ క్రికెటర్ పేరుతో రైల్వే స్టేషన్ ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాగా సచిన్ 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీ మెంటార్‌గా కొనసాగుతున్నారు.

 

Read Also : India vs Australia 3rd T20I: బ్యాటింగ్ కు దిగిన భారత్..

  Last Updated: 28 Nov 2023, 07:44 PM IST