Gavaskar Kohinoor: కోహినూర్ ఎక్కడ…ఇంగ్లీష్ వాళ్లకు చుక్కలు చూపిన గవాస్కర్..!!

భారతీయ దిగ్గజ క్రికెటర్...వ్యాఖ్యత సునీల్ గవాస్కర్...జోకులు పేల్చడంలో ముందుంటాడు. ఓ పక్క ఉత్కంఠగా మ్యాచ్ లు జరుగుతున్నా సరే.

Published By: HashtagU Telugu Desk
sunil gavaskar

sunil gavaskar

భారతీయ దిగ్గజ క్రికెటర్…వ్యాఖ్యత సునీల్ గవాస్కర్…జోకులు పేల్చడంలో ముందుంటాడు. ఓ పక్క ఉత్కంఠగా మ్యాచ్ లు జరుగుతున్నా సరే…మరోపక్క తన కామెంటరీతో జోకులు వేయాల్సిందే. ఆకట్టుకునే కామెంటరీ ఆయన సొంతం. ఆదివారం ముంబై వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గవాస్కర్ కడుపుబ్బా నవ్వించాడు. మ్యాచ్ బ్రేక్ సమయంలో తన హాస్యచతురతను ప్రదర్శించాడు. విరామ సమయంలో ముంబైలోని మెరైన్ డ్రైవ్ ఏరియల్ షూట్స్ ను బ్రాడ్ కాస్టర్స్ చూపిస్తుండగా…సునీల్ గవాస్కర్ స్పందించాడు. షూట్స్ సంగతి గురించి అంటుంటే…వెలకట్టలేని కోహినూర్ వజ్రం ఎక్కడ అని కో-ప్రజెంటర్ కామెంటేటర్ అలెన్ విల్కిన్స్ ను అడిగాడు.

కోహినూర్ డైమండ్ కోసం తాము ఇంకా ఎదురుచూస్తునే ఉన్నాం అన్నాడు. కోహినూర్ గురించి మాట్లాడటానికి వెళ్తున్నావని తెలిసిందని…అలెన్ విల్కిన్స్ స్పందించాడు. దీనికి ప్రతిస్పందనగా గవాస్కర్…ప్రత్యేక పలుబడిని ఉపయోగించి బ్రిటిష్ సర్కార్ తో మాట్లాడేందుకు చొరవ తీసుకోవాలని అలెన్ విల్కిన్స్ ను కోరాడు. దీంతో ఒక్కసారి ఇద్దరు కూడా తెగ నవ్వేశారు. ఈ సంభాషణ అంతా కూడా క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. దీనిపై ట్విట్టర్ యూజర్లు కూడా స్పందించారు. తమదైన శైలిలో పంచులు పేల్చూతూ ట్వీట్స్ చేశారు.

  Last Updated: 12 Apr 2022, 12:02 AM IST