Rohit Sharma: భారత క్రికెట్ జట్టులో ఇటీవల కాలంలో పెద్ద మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముందుగా రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి వన్డే కెప్టెన్సీని తొలగించారు. ఇప్పుడు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఇచ్చిన ఒక ప్రకటన అభిమానుల ఆందోళనను మరింత పెంచింది. రోహిత్ శర్మకు సంబంధించి రాబోయే రోజుల్లో మరో చెడ్డ వార్త వినాల్సి రావచ్చని గవాస్కర్ అన్నారు.
రోహిత్ శర్మకు మరో బ్యాడ్ న్యూస్ రాబోతుందా?
సునీల్ గవాస్కర్ స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ.. రోహిత్ శర్మ భవిష్యత్తు ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన, అతని స్వంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. రోహిత్ తదుపరి రెండు సంవత్సరాలు వన్డేలు ఆడటం కొనసాగిస్తానని ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే అభిమానులు ముందు ముందు మరింత చెడ్డ వార్తకు సిద్ధంగా ఉండాలి అని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలతో రోహిత్ శర్మ త్వరలో వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారా? లేదా టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని నెమ్మదిగా జట్టు నుంచి తొలగించాలని యోచిస్తుందా అనే చర్చ క్రికెట్ వర్గాల్లో వేగవంతమైంది.
Also Read: Vijay Devarakonda Accident : విజయ్ దేవరకొండకు ప్రమాదం.. రష్మిక వల్లేనని కామెంట్స్!
“రోహిత్ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ ఆడాలి”
రోహిత్ శర్మ తన వన్డే కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటే అతను దేశీయ క్రికెట్‌లో చురుకుగా ఉండాలని గవాస్కర్ స్పష్టం చేశారు. రోహిత్ కేవలం వన్డే క్రికెట్ ఆడితే, అతనికి చాలా తక్కువ అవకాశాలు లభిస్తాయని అతనికి తెలుసు. ఇప్పుడు అతను తనను తాను నిరూపించుకోవడానికి విజయ్ హజారే ట్రోఫీ వంటి టోర్నమెంట్లలో ఆడవలసి ఉంటుంది. టీమ్ మేనేజ్‌మెంట్ ఈ వైఖరిని అవలంబించడానికి బహుశా ఇదే కారణం కావచ్చని స్పష్టం చేశాడు.
ఇటీవల బీసీసీఐ కూడా ఎంత సీనియర్ ఆటగాడు అయినా సరే దేశీయ క్రికెట్ ఆడకుండా భారత జట్టులో ఎంపికకు అర్హులు కారని స్పష్టం చేసింది. ఇకపోతే రాబోయే రెండు సంవత్సరాలలో భారత్ చాలా తక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడుతుందని, ఇది రోహిత్‌కు ఫామ్, ఫిట్‌నెస్‌ను కొనసాగించడం కష్టతరం చేస్తుందని గవాస్కర్ అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. “టీమ్ ఇండియా షెడ్యూల్ ఇప్పుడు టెస్ట్, టీ20 ఇంటర్నేషనల్స్‌పై దృష్టి సారించింది. రోహిత్ సంవత్సరానికి కేవలం 5-7 వన్డేలు మాత్రమే ఆడితే, అంత తక్కువ మ్యాచ్‌లతో ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్‌కు సిద్ధం కాలేరు” అని అన్నారు. బహుశా ఈ కారణంగానే సెలెక్టర్లు శుభమన్ గిల్‌ను భవిష్యత్తు కెప్టెన్‌గా సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
