Site icon HashtagU Telugu

Team India T20 Squad: టీమ్ ఎంపికపై గవాస్కర్ హ్యాపీ

Gavaskar Imresizer

Gavaskar Imresizer

టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఎంపికపై పలువురు మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. మంచి జట్టునే బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు. బుమ్రా, హర్షల్‌ పటేల్‌ల రాకతో టీమ్‌ పటిష్టంగా మారిందని సన్నీ అభిప్రాయపడ్డాడు. బుమ్రా, హర్షల్‌ పటేల్‌లు రావడంతో తక్కువ టార్గెట్‌ను కూడా డిఫెండ్‌ చేసుకునే అవకాశాలు పెరిగాయన్నాడు. ఇప్పటి వరకూ లో స్కోరింగ్ ను కాపాడుకోవడం సమస్యగా మారిందనీ,ఈ ఇద్దరు బౌలర్లు ఆ పనిని సమర్థవంతంగా చేయగలరని గవాస్కర్‌ అన్నాడు. అయితే దీపక్‌ చహర్‌ను మాత్రం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. వాళ్లు అర్ష్‌దీప్‌ను కొనసాగించారనీ, ఇది టీమ్‌కు లెఫ్ ఆర్మ్ పేసర్‌ ఆప్షన్‌ను అందిస్తుందన్నాడు. ఇది మంచి సెలక్షన్‌ అన్నాడు. ప్రస్తుతం 100 శాతం అందరూ ఈ టీమ్‌ను సపోర్ట్‌ చేయాలని గవాస్కర్‌ స్పష్టం చేశాడు.

ఇదిలా ఉంటే ప్రధాన జట్టులో యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేయకపోవడంపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతని వయసు తక్కువని, ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అవకాశం దక్కుతుందని అన్నాడు. కాగా వరల్డ్ కప్ టీమ్ లో పేస్‌ బౌలర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌లు తిరిగి రాగా.. సంజు శాంసన్‌కు నిరాశే ఎదురైంది. వికెట్‌ కీపర్లుగా రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు.మహ్మద్‌ షమి, రవి బిష్ణోయ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ చహర్‌లను స్టాండ్‌బై ప్లేయర్స్‌గా ఉంచారు. స్పిన్ విభాగంలో అశ్విన్ , అక్షర్ పటేల్ , చహాల్ చోటు దక్కించుకున్నారు. వరల్డ్ కప్ అక్టోబర్ 16 నుంచి ఆరంభం కానుండగా..భారత్ తన తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తో తలపడనుంది.