Site icon HashtagU Telugu

Stuart Broad: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న స్టువర్ట్ బ్రాడ్.. ఎప్పుడంటే..?

Stuart Broad

Resizeimagesize (1280 X 720) (1) 11zon

Stuart Broad: ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు తర్వాత స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad) క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని కెన్నింగ్‌టన్‌ ఓవల్‌ మైదానంలో చివరి మ్యాచ్‌ జరుగుతోంది. ఇదిలా ఉంటే నా కెరీర్‌లో ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని స్టువర్ట్ బ్రాడ్ తెలిపాడు. శనివారం ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మూడో రోజు జరిగింది.

స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ కెరీర్ ఇలా

స్టువర్ట్ బ్రాడ్ కెరీర్‌ను పరిశీలిస్తే.. ఈ ఆటగాడు టెస్టు మ్యాచ్‌లే కాకుండా వన్డేలు, టీ20ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా స్టువర్ట్ బ్రాడ్ టెస్ట్ కెరీర్ అద్భుతంగా ఉంది. స్టువర్ట్ బ్రాడ్ 167 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇది కాకుండా 121 వన్డేలు, 56 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. స్టువర్ట్ బ్రాడ్ 167 టెస్ట్ మ్యాచ్‌లలో 27.67 సగటుతో 55.77 స్ట్రైక్ రేట్‌తో 602 వికెట్లు తీశాడని గణాంకాలు చెబుతున్నాయి.

Also Read: West Indies Beat India: రెండో వన్డేలో భారత్ పై వెస్టిండీస్ విజయం

ODI, T20 ఫార్మాట్‌లో స్టువర్ట్ బ్రాడ్ గణాంకాలు ఎలా ఉన్నాయి..?

స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో 20 సార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 3 సార్లు 10 వికెట్లు తీశాడు. అలాగే, స్టువర్ట్ బ్రాడ్ ఒక టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 28 సార్లు 4 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో స్టువర్ట్ బ్రాడ్ 121 వన్డేల్లో 178 వికెట్లు తీశాడు. కాగా, స్టువర్ట్ బ్రాడ్ 56 టీ20 మ్యాచుల్లో 65 వికెట్లు పడగొట్టాడు. అయితే స్టువర్ట్ బ్రాడ్‌కు ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాలేదు. ఇది కాకుండా అతను వన్డేలు, T20 మ్యాచ్‌లకు బదులుగా ఇంగ్లాండ్ తరపున టెస్టులు ఆడటం కొనసాగించాడు.