Site icon HashtagU Telugu

Road Safety World Series:రోడ్ సేఫ్టీ సిరీస్ లో ఇండియా లెజెండ్స్ బోణీ

RSWS

RSWS

దిగ్గజ క్రికెటర్లంతా కలిసి ఆడుతున్న రోడ్ సేఫ్టీ సిరీస్ ను ఇండియా లెజెండ్స్ టీమ్ ఘనంగా ఆరంభించింది. కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్ , సౌతాఫ్రికా లెజెండ్స్ పై విజయం సాధించింది.
ఈ మ్యాచ్ మొదట బ్యాటింగ్ కు దిగిన ఇండియా లెజెండ్స్ భారీస్కోర్ చేసింది. నమన్ ఓజాతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సచిన్ రెండు ఫోర్లు కొట్టి అభిమానులను అలరించాడు. దూకుడుగా ఆడే క్రమంలో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓజా కూడా 21 రన్స్ కు వెనుదిరిగాడు. ఈ దశలో సురేష్ రైనాతో కలిసి స్టువర్ట్ బిన్నీ ఇండియా ఇన్నింగ్స్ ను గాడిన పెట్టాడు. రైనా 22 బాల్స్ లో ఒక సిక్సర్ నాలుగు ఫోర్లతో 33 రన్స్ చేసి ఔటవగా.. స్టువర్ట్ బిన్నీ మాత్రం చెలరేగిపోయాడు. 42 బాల్స్ లో ఆరు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా బిన్నీ బ్యాటింగ్ జోరు మాత్రం తగ్గలేదు. చివరలో యూసఫ్ పఠాన్ కూడా మెరుపులు మెరిపించాడు. కేవలం 15 బాల్స్ లోనే 4 సిక్సర్లు, ఒక ఫోర్ తో 35 రన్స్ చేశాడు. దీంతో ఇండియా లెజెండ్స్ నాలుగు వికెట్లకు 217 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ 6 పరుగులకే ఔటై నిరాశపరిచాడుయ సౌతాఫ్రికా లెజెండ్స్ బౌలర్లలో వండర్ వాత్ 2, ఎన్తిని, ఎడ్డీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా
గత సీజన్‌లో 35 బంతుల్లో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును స్టువర్ట్ బిన్నీ దాటేశాడు. 218 పరుగుల భార లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ ఆశించిన వేగంతో ఆడలేకపోయింది. భారత లెజెండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో వరుస వికెట్లు కోల్పోయింది. పుట్టిక్ 23, వాన్ విక్ 26, పిటర్సన్ 10, రుడాల్ఫ్ 16 పరుగులకే ఔటయ్యారు. మిగిలిన బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేదు. దీంతో సౌతాఫ్రికా లెజెండ్స్ ఓటమిపాలైంది. భారత బౌలర్లలో రాహుల్ శర్మ 3 , ఓజా 2 వికెట్లు పడగొట్టారు.