Site icon HashtagU Telugu

Struggling Punjab: పంజాబ్ కు చివరి ఛాన్స్…గుజరాత్ జోరుకు బ్రేక్ వేస్తుందా ?

PBKS vs DC

Pbks Imresizer

ఐపీఎల్ లో పంజాబ్ భవిష్యత్తు ఇవ్వాళ్టి మ్యాచ్‌తో తేలిపోతుంది. కీలక మ్యాచ్ లి దూకుడు మీద ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో నాలుగింట్లో నెగ్గిన ఏ జట్టు ఎనిమిది పాయింట్లతో ఎనిమిదో స్థానానికి దిగజారింది. తన చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ చేతిలో ఓడింది. మయాంక్ అగర్వాల్ కేప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ పడుతూ లేస్తూ సాగుతోంది. తొమ్మిది మ్యాచ్‌లను ఆడిన తరువాత కూడా వరుసగా రెండింట్లో విజయం సాధించలేదు. సన్‌రైజర్స్, ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిన తరువాత చెన్నైపై విజయం సాధించింది. మళ్లీ లక్నో చేతిలో ఓడింది.
శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, షారుఖ్ ఖాన్, ఓడియన్ స్మిత్, భానుక రాజపక్స.. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ బాగున్నప్పటికీ ఒకరిద్దరే ఆడుతున్నారు. లక్నోపై 153 పరుగులను కూడా ఛేదించలేకపోయింది.బ్యాటింగ్ గాడిన పడితే తప్ప విజయం సాధించడం కష్టమే.

మరోవైపు ఐపీఎల్ లో తొలిసారి అడుగు పెట్టిన గుజరాత్ టైటాన్స్ మాత్రం వరుస విజయాలతో దుమ్ము రేపుతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోన్న గుజరాత్ తొమ్మిది మ్యాచ్‌ల్లలో ఒక్క ఓటమి మాత్రమే చవిచూసింది. ఓపెనింగ్ నుంచి లోయర్ ఆర్డర్ వరకూ ఎవరో ఒకరు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో అదరగొడుతున్నారు. దుమ్ములేపుతోంది. ఇలాంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న గుజరాత్‌ ను పంజాబ్ బౌలర్లు రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ ఎలా కట్టడి చేస్తారో చూడాలి. గుజరాత్ ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. అయితే ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే పంజాబ్ కింగ్స్ కు ఇదే చివరి అవకాశం. మరి ఇలాంటి పరిస్థతుల్లో పంజాబ్ గుజరాత్ ను నిలువరించాలంటే అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది.

Exit mobile version