Michael Holding: క్రికెట్ చరిత్రలో ‘మైఖేల్ హోల్డింగ్’

క్రికెట్ చరిత్రలో కొందరు ఆటగాళ్లు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ ఇలా విభాగం ఏదైనా తమదైన స్టయిల్ లో మైదానంలో రెచ్చిపోయే ఆటగాళ్లు ఎందరో ఉన్నారు

Michael Holding: క్రికెట్ చరిత్రలో కొందరు ఆటగాళ్లు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ ఇలా విభాగం ఏదైనా తమదైన స్టయిల్ లో మైదానంలో రెచ్చిపోయే ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. కానీ కొంతమందికి మాత్రం అరుదైన గౌరవం దక్కుతుంది. ప్రపంచ క్రికెట్ జట్లలో ఒక దశలో వెస్టిండీస్ ప్రమాదకరమైన జట్టుగా కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో అరివీరభయంకరులు ఉండేవారు. ఆ దేశానికి 1975 లోనే ప్రపంచ కప్ వచ్చింది అంటే ఆ జట్టు స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది ఆటగాళ్ల పేర్లు ప్రసిద్ధి చెందాయి. అయితే మైఖేల్ హోల్డింగ్ పేరు మాత్రం ప్రత్యేకమని చెప్పాలి.

1975లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి మైఖేల్ హోల్డింగ్(Michael Holding) అడుగుపెట్టాడు. సరిగ్గా సంవత్సరం తిరిగే లోపు మైఖేల్ హోల్డింగ్ పేరు ప్రపంచ క్రికెట్లో మారుమ్రోగిపోయింది.హోల్డింగ్‌ను ‘విస్పరింగ్ డెత్'(Whispering Death) అని పిలుస్తారు. ఎందుకంటే ఈ డేంజరస్ బౌలర్ బ్యాట్స్ మెన్ల రక్తం చూడకుండా పెవిలియన్ కి చేర్చేవాడు కాదు. తాను బంతి విసిరితే ఒక్కో బంతి అగ్ని శకలంల చెవి దగ్గర ఈలలు వేస్తూ వెళ్ళేది. బ్యాట్స్‌మన్ పరుగులు చేయడం కంటే బ్రతికుంటే చాలు అనుకునేవారు.

1976లో వెస్టిండీస్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో కరేబియన్ జట్టు పై చేయి సాధించింది. ఇంగ్లండ్‌ తొలిసారిగా సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ ఓడిపోయే అంచున నిలిచింది. ఐదో టెస్టులో ఇంగ్లిష్ జట్టు పరువు కాపాడుకునేందుకు పోరాడాల్సి వచ్చింది. ఓవల్ మైదానంలో మైఖేల్ హోల్డింగ్ తన పేస్ ఆధారంగా స్వదేశంలో ఇంగ్లీష్ జట్టు అత్యంత దారుణమైన ఓటమిని రుచి చూసింది. హోల్డింగ్ భీకర డెలివరీలకు ఇంగ్లాండ్ ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌లకు భయం పట్టుకుంది. ది ఓవల్‌ పిచ్‌ను బ్యాట్స్‌మెన్ స్వర్గధామంగా భావించారు. అయితే హోల్డింగ్ తన బౌలింగ్‌తో ఆ రోజు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌లకు అదే మైదానాన్ని నరకం కంటే అధ్వాన్నంగా మార్చాడు.

తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసం సృష్టించిన హోల్డింగ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ విధంగా కరీబియన్ బౌలర్ 149 పరుగులిచ్చి మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఓవల్‌లో ఇంగ్లండ్‌ రక్తపు కన్నీళ్లు పెట్టుకుంది. హోల్డింగ్ బౌలింగ్ ఆధారంగా వెస్టిండీస్ ఈ టెస్టు మ్యాచ్‌లో 231 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ 1979లో ప్రపంచకప్ గెలిచిన జట్టులోని సభ్యుల్లో మైఖేల్ హోల్డింగ్ ఒకరు. మొత్తం 60 టెస్టులు, 102 వన్డేలు ఆడాడు. 391 వికెట్లు పడగొట్టాడు.సుదీర్ఘ ఫార్మాట్‌లో 249 వికెట్లు తీయగా, వన్డేలో మొత్తం 142 వికెట్లు సాధించాడు. హోల్డింగ్ తన కెరీర్‌లో 13 సార్లు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు మరియు ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లను రెండుసార్లు తీశాడు.

Also Read: GHMC High Alert: ఇండ్లలోనే ఉండండి, బయటకు రాకండి.. సిటీ జనాలకు GHMC అలర్ట్