Site icon HashtagU Telugu

SAFF Championship: ఫుట్‌బాల్ మ్యాచ్ లో తోపులాట.. భారత ప్రధాన కోచ్ కి రెడ్ కార్డ్..!

SAFF Championship

Resizeimagesize (1280 X 720) (3)

SAFF Championship: SAFF ఛాంపియన్‌షిప్ 2023 (SAFF Championship)లో భారతదేశం, కువైట్ మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ 1-1 డ్రాగా ముగిసింది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో తోపులాట జరిగింది. వాస్తవానికి ఛాంపియన్‌షిప్‌లో భారత ప్రధాన కోచ్ ఇగోర్ స్టిమాక్ రెండోసారి రెడ్ కార్డ్ పొందాడు. ప్రధాన కోచ్ మ్యాచ్ అధికారులతో వాదించడం కనిపించింది. దీని కారణంగా 81వ నిమిషంలో అతనికి రెడ్ కార్డ్ చూపబడింది. ఈ టోర్నీలో భారత ప్రధాన కోచ్ ఇగోర్ స్టిమాక్ రెడ్ కార్డ్ పొందడం ఇది రెండోసారి. అంతకుముందు టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ ఆటగాడి చేతి నుంచి బంతిని లాక్కోవడంతో కోచ్ ఇగోర్‌కు రోడ్‌కార్డ్ ఇచ్చి బయటకు పంపించారు. నేపాల్‌తో జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్‌లో ప్రధాన కోచ్ లేకుండానే టీమిండియా ఆడింది. అదే సమయంలో సెమీ ఫైనల్‌లో కూడా ప్రధాన కోచ్ లేకుండానే జట్టు ఆడాల్సి ఉంటుంది. సెమీస్‌లో భారత జట్టు లెబనాన్‌తో పోటీపడనుంది.

అసిస్టెంట్ కోచ్ గావ్లీ రిఫరీని విమర్శించారు

ఈ గొడవను చూసిన భారత అసిస్టెంట్ కోచ్ మ్యాచ్ రిఫరీని తిట్టాడు. అధికారుల నాణ్యత గురించి కూడా ఆయన మాట్లాడారు. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో గావ్లీ మాట్లాడుతూ.. రిఫరీల తీరు దారుణంగా ఉందన్నారు. SAFF అధికారుల నాణ్యత గురించి ఆలోచించాలి, లేకపోతే క్రీడా టోర్నమెంట్ దెబ్బతింటుంది. మా కోచ్ తప్పు లేదు. రిఫరీ మ్యాచ్‌ను నియంత్రించలేకపోయాడని విమర్శించారు.

Also Read: IND vs IRE: భారత్- ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 18 నుంచి 23 వరకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌…! 

ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలుత 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ 45వ నిమిషంలో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. సునీల్ ఛెత్రీ అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 92వ గోల్. సెకండాఫ్‌లో భారత ఆటగాడు అన్వర్ అలీ ఎదురుదాడిని కాపాడే క్రమంలో తన సొంత గోల్ పోస్ట్‌లో గోల్ చేశాడు. ఈ సెల్ఫ్ గోల్ కారణంగా మ్యాచ్ 1-1తో సమం చేసి డ్రాగా ముగిసింది.