Steve Smith: ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్.. వర్టిగోతో బాధపడుతున్న స్టీవ్ స్మిత్..!

ఆఫ్ఘనిస్తాన్‌తో తన తదుపరి మ్యాచ్‌కు ముందు ఆసీస్ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) వర్టిగోతో బాధపడుతున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Steve Smith

Compressjpeg.online 1280x720 Image 11zon

Steve Smith: ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి ఒక అడుగు దూరంలో ఉంది ఆస్ట్రేలియా జట్టు. ఆఫ్ఘనిస్తాన్‌తో తన తదుపరి మ్యాచ్‌కు ముందు ఆసీస్ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) వర్టిగోతో బాధపడుతున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు తనకు మళ్లీ మళ్లీ తల తిరుగుతున్నదని, ఇది తనను ఇబ్బంది పెడుతున్నదని స్వయంగా వెల్లడించాడు స్మిత్. ప్రపంచకప్ 2023లో 39వ మ్యాచ్ ఆస్ట్రేలియా- ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.

అఫ్గానిస్థాన్‌తో జరిగే ఈ మ్యాచ్‌కు ముందు స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. గత ఒకటి, రెండు రోజులుగా నాకు కొద్దిగా తలతిరుగుతున్నట్లు అనిపిస్తోంది. అది కాస్త కలవరపెడుతోంది. నేను మంచిగా ఉండగలనని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు ఎంపిక చేయడానికి స్టీవ్ స్మిత్ అందుబాటులో ఉంటారా అని విలేకరుల సమావేశంలో అడిగినప్పుడు. దీనిపై ఆయన స్పందిస్తూ.. శిక్షణ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.

Also Read: Sri Lanka Cricket Board : శ్రీలంక క్రికెట్‌ బోర్డు రద్దు.. ఎందుకో తెలుసా ?

గాయాలు, ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఆస్ట్రేలియా ప్రస్తుతం ఇబ్బంది పడుతోంది. మాక్స్‌వెల్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో చివరి మ్యాచ్ ఆడలేకపోయాడు. మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి తిరిగి వెళ్ళాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కి ఇద్దరు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు.

We’re now on WhatsApp : Click to Join

ప్రపంచకప్‌లో నేడు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా ఏడు మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు సాధించింది. ఐదు మ్యాచ్‌లు గెలిచింది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ఏడు మ్యాచ్‌లలో ఎనిమిది పాయింట్లను కలిగి ఉంది. ఇరు జట్లూ విజయంపై కన్నేశాయి.

  Last Updated: 07 Nov 2023, 06:39 AM IST