Site icon HashtagU Telugu

ASIA CUP : భారత్ ధాటికి బ్యాట్లెత్తేసిన శ్రీలంక

222

222

మహిళల ఆసియాకప్ ఫైనల్లో హోరాహోరీ పోరు కోసం ఎదురుచూసిన క్రికెట్ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. సెమీస్ లో పాక్ ను నిలువరించిన శ్రీలంక మహిళల జట్టు తుది పోరులో మాత్రం చేతులెత్తేసింది. భారత బౌలర్ల ధాటికి విలవిలలాడిన లంక కేవలం 65 పరుగులకే పరిమితమైంది. టాస్ గెలవడం ఒక్కటే లంకకు దక్కిన ఆనందం. ఈ సంతోషం ఆవిరయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. మూడో ఓవర్ నుంచే లంక పతనం మొదలైంది. స్కోర్ కనీసం 10కి కూడా చేరకుండానే నలుగురు…25 పరుగులకే మరో ముగ్గురు ఔటయ్యారు. అంచనాలు పెట్టుకున్న చమారా ఆటపట్టు , డిసిల్వా, హాసిని నిరాశపరిచారు. చివర్లో రణవీర కాసేపు పోరాడకుంటే శ్రీలంక స్కోర్ 50 కూడా దాటేది కాదు. లంక ఇన్నింగ్స్ లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించగా… మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 3, రాజేశ్వరి 2 , స్నేహరాణా 2 వికెట్లు పడగొట్టారు.