T20 WC: ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసిన శ్రీలంక

సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో శ్రీలంక అదరగొట్టింది.

Published By: HashtagU Telugu Desk
Sri Lanka

Srilanka

సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో శ్రీలంక అదరగొట్టింది. ఆఫ్గనిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. టాపార్డర్ పర్వలేదనిపించినా… మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. లంక స్పిన్నర్ హసరంగా ఆఫ్గన్ బ్యాటింగ్ ను దెబ్బ తీశాడు. దీంతో ఆఫ్గనిస్తాన్ 144 పరుగులు చేసింది. గుర్బాజ్ 28, ఉస్మాన్ గని 27 రన్స్ చేశారు. లంక బౌలర్లలో హాసరంగ 3, లహిరు కుమార 2 వికెట్లు పడగొట్టారు.

145 పరుగుల లక్ష్య చేదనలో లంక 43 రన్స్ కు రెండు వికెట్లు కోల్పోయింది. నిస్సాంక 10, కుషాల్ మెండీస్ 25 రన్స్ కు ఔటయ్యారు. అయితే ధనంజయ డిసిల్వా మెరుపు హాఫ్ సెంచరీతో లంకను గెలిపించాడు. ధనంజయ 42 బంతుల్లో 6 ఫోర్లు , 2 సిక్సర్లతో 66 పరుగులు చేశారు. దీంతో శ్రీలంక 18.3 ఓవర్లలో టార్గెట్ చేదించింది. ఈ విజయంతో లంక సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. అటు ఆఫ్గనిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

  Last Updated: 01 Nov 2022, 01:11 PM IST