SL Beat Ire: ఐర్లాండ్‌పై లంక ఘనవిజయం

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. పసికూన ఐర్లాండ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

Published By: HashtagU Telugu Desk
Sri Lanka

Srilanka

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. పసికూన ఐర్లాండ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ పోరులో ఐర్లాండ్ లంకకు పోటీ ఇవ్వలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్‌ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. 26 పరుగులకే బల్బ్రీన్ , టక్కర్ వికెట్లు చేజార్చుకుంది. మరో ఓపెనర్ స్టిర్లింగ్, టెక్టార్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ రాణించడంతో కాస్త కోలుకుంది. స్టిర్లింగ్ 34 , టెక్టర్ 45 పరుగులు చేశారు.

వీరిద్దరూ ఔటైన తర్వాత మరో బ్యాటర్ ఎవరూ నిలదొక్కుకోలేకపోవడంతో ఐర్లాండ్‌ 128 పరుగులే చేయగలిగింది. లంక బౌలర్లలో తీక్షణ , హసరంగ రెండేసి వికెట్లు , ఫెర్నాండో, లహిరు కుమారా, కరుణారత్నే, డిసిల్వా ఒక్కో వికెట్ పడగొట్టారు. టార్గెట్ చిన్నదే అయినా లంక దూకుడుగా ఆడింది. ఓపెనర్లు కుషాల్ మెండిస్, ధనంజయ్ డిసిల్వా తొలి వికెట్‌కు 8.2 ఓవర్లలో 63 పరుగులు జోడించారు. డిసిల్వా 31 రన్స్‌కు ఔటవగా.. కుశాల్ మెండిస్, అసలంక జట్టు విజయాన్ని పూర్తి చేశారు. వీరిద్దరూ 70 పరుగులు అజేయ పార్టనర్ షిప్‌తో లంక 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కుశాల్ మెండిస్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 నాటౌట్ , అసలంక 22 బంతుల్లో 2 ఫోర్లతో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

  Last Updated: 23 Oct 2022, 01:19 PM IST