world cup 2023: సెమీస్ కోసం లంక పోరాటం: శ్రీలంక – బంగ్లాదేశ్ హెడ్ టూ హెడ్ రికార్డ్స్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక , బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ బరిలో దిగిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

world cup 2023: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక , బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ బరిలో దిగిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లలోనే కుషాల్ నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన బంగ్లాదేశ్ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. శ్రీలంక అధికారికంగా సెమీస్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాలి. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ స్థానంలో తాంజిమ్ సాకిబ్ జట్టులోకి వచ్చాడు. ఇక శ్రీలంక జట్టులో కరుణరత్నే, హేమంత ప్లేస్ లో కుశాల్ పెరీరా, ధనంజయ జట్టులో స్థానం దక్కించుకున్నారు.

ఈ ప్రపంచకప్ లో శ్రీలంక ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడింది. అందులో కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. మిగతా రెండు మ్యాచుల్లో మంచి రన్ రేటుతో గెలవాల్సి ఉంది. లంక సెమిస్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తదుపరి మ్యాచ్ లలో ఓడితే నాలుగు జట్లు 8 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఎక్కువ నెట్ రన్ రేట్‌తో ఉన్న జట్టు సెమీస్ కు అర్హత సాధిస్తుంది. బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించగా, లంక సెమిస్ కోసం కష్టపడుతుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక గెలిస్తేనే సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి..

ప్రపంచ కప్‌లో శ్రీలంక బాంగ్లాదేశ్ 4 సార్లు తలపడ్డాయి. ఇందులో శ్రీలంక 3 మ్యాచ్‌లను గెలుచుకుంది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. వన్డేల్లో ఇరు జట్ల మధ్య 53 మ్యాచ్‌లు జరిగితే అందులో శ్రీలంక 42 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, బంగ్లాదేశ్ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది.

Also Read: Kohli Century : కోహ్లీ సెంచరీ కొట్టి సచిన్ రికార్డు సమం చేసాడు..మనం కూడా సెంచరీ కొట్టాలి – KTR