- టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన లంక
- కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనున్న శ్రీలంక
T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026 భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమై, మార్చి 8న జరిగే ఫైనల్ పోరుతో ముగియనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు తన ప్రాథమిక జట్టును ప్రకటించింది. జట్టులో కొత్త కెప్టెన్ ఎంట్రీ ఇవ్వగా.. పలువురు యువ ఆటగాళ్లకు కూడా అవకాశం కల్పించారు. శ్రీలంక గతంలో 2014లో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది.
కొత్త కెప్టెన్ ఎంట్రీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం చరిత్ అసలంక స్థానంలో దాసున్ షనకకు మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. బ్యాటర్‌గా అసలంక వరుసగా విఫలమవుతుండటంతో అతనిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.
Also Read: ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ బాబు!
మొత్తం 20 జట్లను 4 గ్రూపులుగా ఇలా విభజించారు.
- గ్రూప్ ఏ: భారత్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్.
- గ్రూప్ బి: ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్.
- గ్రూప్ సి: ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇటలీ, నేపాల్.
- గ్రూప్ డి: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యూఏఈ.
పాకిస్థాన్‌తో సిరీస్ టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. అక్కడ ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. జనవరి 7న మొదటి మ్యాచ్, జనవరి 9న రెండో మ్యాచ్, జనవరి 11న మూడో టీ20 మ్యాచ్ జరగనున్నాయి. ఈ సిరీస్ ముగిసిన తర్వాత శ్రీలంక ప్రపంచకప్ బరిలోకి దిగుతుంది.
టీ20 ప్రపంచకప్ 2026 కోసం శ్రీలంక ప్రాథమిక జట్టు: దాసున్ షనక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, కుసల్ మెండిస్, కమిల్ మిషార, కుసల్ పెరీరా, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా, జనిత్ లియనగే, చరిత్ అసలంక, కమిందు మెండిస్, పవన్ రత్నాయకే, సహన్ అరాచిగే, వానిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, మిలన్ రత్నాయకే, నువాన్ తుషార, ఈషాన్ మలింగ, దుష్మంత చమీర, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరానా, దిల్షాన్ మదుశంక, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, విజయ్ కాంత్ వియాస్ కాంత్ మరియు ట్రావీన్ మాథ్యూ.
