Sri Lanka: రాణించిన రాజపక్స,హసరంగా.. పాక్ టార్గెట్ 171

ఆసియాకప్‌లో శ్రీలంక మరోసారి ఆకట్టుకుంది. ఫైనల్లో తడబడి నిలబడి మంచి స్కోర్ చేసింది.

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 09:41 PM IST

ఆసియాకప్‌లో శ్రీలంక మరోసారి ఆకట్టుకుంది. ఫైనల్లో తడబడి నిలబడి మంచి స్కోర్ చేసింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తడబడింది. కేవలం 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న నిస్సాంక 8 పరుగులకే ఔటవగా.. కుశాల్ మెండిస్ డకౌటయ్యాడు. ధనంజయ డిసిల్వా 28 పరుగులతో రాణించినా.. గుణలతిక 1, కెప్టెన్ శనక నిరాశపరిచారు.

అయితే సెకండాఫ్‌లో మాత్రం లంక అద్భుతంగా పుంజుకుంది. భనుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. హసరంగాతో కలిసి కీలక పార్టనర్ షిప్ నెలకొల్పాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. అటు హసరంగా కూడా ధాటిగా ఆడాడు. హసరంగా 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 36 పరుగులు చేశాడు. వీరిద్దరి జోరుతో శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. శ్రీలంక చివరి 4 ఓవర్లలో 50 పరుగులు చేసింది. ఆరంభంలో వికెట్లు తీసిన పాకిస్థాన్ తర్వాత పేలవ బౌలింగ్‌తో చేతులెత్తేసింది. దీనికి తోడు పేలవ ఫీల్డింగ్‌తో పలు క్యాచ్‌లు వదిలేయడం కూడా లంకకు కలిసొచ్చింది. దీంతో లంక మంచి స్కోర్‌తో మ్యాచ్‌లో నిలిచింది. ఒక దశలో కనీసం 140 పరుగులైనా చేస్తుందనుకుంటే హసరంగ, రాజపక్స జోరుతో పోరాడే టార్గెట్‌ను పాక్ ముందుంచింది. పాక్ నిలకడ లేమి బ్యాటింగ్‌తో ఇబ్బంది పడు.