IPL 2024 : ఉత్కంఠ పోరు లో SRH విజయం

202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఒకే ఒక రన్ తో ఓటమి చెందింది

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 11:46 PM IST

ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో SRH విజయం సాధించింది. చివరి బాల్ వరకు ఉత్కంఠగా ఈ మ్యాచ్ సాగింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఒకే ఒక రన్ తో ఓటమి చెందింది. చివరి ఓవర్లలో కమిన్స్, భువనేశ్వర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి..SRH కు విజయం అందించాడు. టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన SRH ఈరోజు సొంత గ్రౌండ్ లో విజయం సాధించాలని బరిలోకి దిగింది. ముఖ్యంగా తెలుగబ్బాయి నితీశ్‌ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ ( 44 బంతుల్లో 58, 6 ఫోర్లు, 3 సిక్స్ లు) అర్ధ సెంచరీతో అలరించాడు. ఆక ఆఖరులో హెన్రిచ్ క్లాసెన్ 19 బంతుల్లో 42, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. దీంతో హైదరాబాద్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు మొదటి ఓవర్ లోనే భువనేశ్వర్‌ రెండు కీలక వికెట్లు తీసాడు. కానీ ఆ తర్వాత మాత్రం రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్స్ విజయం వైపు తీసుకెళ్లారు. యశస్వి జైశ్వాల్‌ (40 బంతుల్లో 67 రన్స్‌), రియాన్‌ పరాగ్‌ (49 బంతుల్లో 77 రన్స్‌) జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. దీంతో రాజస్థాన్‌ ఈజీగా గెలిచేలా కనిపించింది. చివరి రెండు ఓవర్లలో రాజస్థాన్ విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో 19వ ఓవర్‌ వేసిన కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌.. తొలి బంతికే ధ్రువ్‌ జురెల్‌ను ఔట్ చేసి ఊపిరి పోసాడు. ఆ తర్వాత 4 బంతులకు కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడం తో SRH అభిమానులు గెలుపు ఖాయమని ఫిక్స్ అయ్యారు. కానీ చివరి బంతిని పోవెల్‌ సిక్స్‌ కొట్టడంతో చివరి ఓవర్‌లో సమీకరణం 6 బంతుల్లో 13 రన్స్‌గా మారింది. ఆ సమయంలో చివరి ఓవర్ భువనేశ్వర్‌ అందుకున్నాడు. ఈ ఓవర్‌లో తొలి మూడు బంతులకు 1, 2, 4 వచ్చాయి. ఆ తర్వాత రెండు బంతులకు వరుసగా 2 2 చొప్పున రావడంతో రాజస్థాన్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. కానీ ఈ బంతికి పోవెల్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగడంతో SRH ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.

Read Also : Roja: జగన్ విశ్వశనీయతను ప్రజలు అర్థం చేసుకుంటారు: రోజా