IPL 2024 : లక్నో ఫై ఓపెనర్ల ఊచకోత..SRH ఘనవిజయం

ఓపెనర్లిద్దరూ పోటీపడి బౌండరీలు బాదడంతో 10 ఓవర్లలోపే విజయం వరించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు మరింత మెరుగయ్యాయి

  • Written By:
  • Publish Date - May 8, 2024 / 10:45 PM IST

ఉప్పల్ (Uppal) వేదికగా లక్నోతో జరిగిన మ్యాచులో SRH (SRH vs LSG) ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన SRH కేవలం 9.4 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్లు హెడ్, అభిషేక్ లు లక్నో బౌలర్ల ఫై విరుచుకపడ్డారు. హెడ్ (89*), అభిషేక్ (75*) ఇద్దరు నువ్వా నేనా అన్న విధంగా మెరుపు దాడి చేశారు. ప్రతి బాల్ ఫోర్ , సిక్స్ లతో మోతమోగించారు. దీంతో స్టేడియం మొత్తం అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నోటీం ను సన్ రైజర్స్ బౌలర్లు కట్టడి చేసారు. అద్భుతమైన ఫీలింగ్ తో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగేలా చేసారు. లక్నో టీమ్ లో టాపార్డర్ విఫలమవ్వగా.. బదోని(55), పూరన్ (48) పరుగులతో రాణించారు. SRH బౌలర్లలో భువనేశ్వర్ 2, కమిన్స్ ఒక వికెట్ తీశారు. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకున్నారు. ఓపెనర్లు హెడ్ (89*), అభిషేక్ (75*) ఇద్దరు చెలరేగిపోయారు. ఓపెనర్లిద్దరూ పోటీపడి బౌండరీలు బాదడంతో 10 ఓవర్లలోపే విజయం వరించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు మరింత మెరుగయ్యాయి.

ఇక స్వింగ్ కింగ్ భువనేశ్వర్ ఈ సీజన్లో ఇప్పటివరకు 10 వికెట్లు తీశారు. దీంతో IPL 2024లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా లీడింగ్లో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఖలీల్ అహ్మద్ (8) ఉన్నారు. కాగా లక్నోతో జరుగుతున్న మ్యాచులో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన భువీ కేవలం 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. అలాగే ఈ సీజన్లో ప్లేయర్లు కేవలం 13,079 బంతుల్లోనే 1,000 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించారు. బంతుల పరంగా ఈ మెగా టోర్నీలో ఇదే రికార్డు. అంతకుముందు ఈ మార్కును చేరుకునేందుకు 2023లో 15,390, 2022లో 16,269 బంతులు తీసుకున్నారు. కాగా ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల జాబితాలో సునీల్ నరైన్ (32) తొలి స్థానంలో ఉన్నారు.

Read Also : Jagan Foreign Tour : విదేశీ టూర్ కు జగన్ సిద్ధం..