SRH vs CSK: CSKకు అద్భుత విజయాన్ని అందించిన రుతురాజ్ గైక్వాడ్..!!

IPL-2022తాజా సీజన్ లో మెరుగైన బౌలింగ్ వనరులున్నా జట్టుగా గుర్తింపు పొందిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదివారం జరిగిన మ్యాచ్ లో విభిన్నమైన పరిస్థితి ఎదుర్కొంది.

  • Written By:
  • Publish Date - May 2, 2022 / 12:33 AM IST

IPL-2022తాజా సీజన్ లో మెరుగైన బౌలింగ్ వనరులున్నా జట్టుగా గుర్తింపు పొందిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదివారం జరిగిన మ్యాచ్ లో విభిన్నమైన పరిస్థితి ఎదుర్కొంది. సన్ రైజర్స్ ను చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఓ ఆట ఆడుకున్నారు. ఎంఎస్ ధోనీ CSKకెప్టెన్ గా తిరిగి బాధ్యతలు తీసుకున్న తర్వాత మూడోసారి విజయాన్ని సాధించింది. నికోలస్ పూరన్ 67 పరుగులతో చేసినా ఫలించలేదు. ముఖేశ్ చౌదరి నాలుగు వికేట్లు తీయడంతో CSKసీజన్ లో మూడోసారి విజయాన్ని అందుకుంది.

గైక్వాడ్, కాన్వే, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, మార్ క్రమ్, నటరాజన్ లు బౌలింగ్ ను రఫ్ఫాడించారు. అయితే గైక్వాడ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నటరాజన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. చివర్లో వచ్చిన ధోని 8 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. చివరి ఓవర్లోనూ కాన్వే పరుగుల జోరు కొనసాగింది. దాంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగులు చేసింది.

సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీయగా..అత్యంత వేగంగా బౌలింగ్ వేస్తాడని పేరొందిన ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్ లో ఏమాత్రం ప్రభావం చూపలేదు. అతడి బౌలింగ్ లోనే చెన్నై ఓపెనర్లు అత్యధిక పరుగులు తీశారు. నాలుగు ఓవర్లు చేసిన ఉమ్రాన్ మాలిక్ 48 పరుగులు సమర్పించుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్ ఓ బంతిని 154 కిమీ వేగంతో విసరగా…గైక్వాడ్ దాన్ని అద్బుతమైన స్ట్రెయిట్ డ్రైవ్ గా మలుచుకున్నాడు.