CSK vs SRH: 54 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నై

ఐపీఎల్ 18వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓవర్‌లో 7 పరుగులు రాబట్టింది. రచిన్‌ రవీంద్ర, రుతురాజ్‌ జోడీ నెమ్మదిగా ఆటని ప్రారంభించింది.

CSK vs SRH: ఐపీఎల్ 18వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓవర్‌లో 7 పరుగులు రాబట్టింది. రచిన్‌ రవీంద్ర, రుతురాజ్‌ జోడీ నెమ్మదిగా ఆటని ప్రారంభించింది. అయితే 25 పరుగుల స్కోరు వద్ద చెన్నైకి తొలి దెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ రచిన్ రవీంద్రను పెవిలియన్ చేర్చాడు. రచిన్ ఇచ్చిన క్యాచ్ ని ఐడెన్ మార్క్రామ్ సింపుల్ గా ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్రమంలో రచిన్ 12 పరుగులు చేశాడు. మూడు మ్యాచ్‌ల తర్వాత భువీ ప్రస్తుత సీజన్‌లో తొలి వికెట్‌ తీశాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి 1 వికెట్ నష్టానికి చెన్నై సూపర్ కింగ్స్ 33 పరుగులు చేసింది. అయితే 7 ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ వికెట్ సమర్పించుకున్నాడు. ఈ సమయానికి చెన్నై 54 పరుగులు చేసింది. గైక్వాడ్ అవుట్ అయ్యే సమయానికి రహానే (16) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.ఇక గైక్వాడ్ వెనుదిరగడంతో శివమ్ దూబే క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం చెన్నై స్కోర్ నెమ్మదిగా సాగుతుంది.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మూడు మార్పులతో రంగంలోకి దిగింది. పతిరానా స్థానంలో ముఖేష్ చౌదరిని జట్టులోకి తీసుకున్నట్లు రీతురాజ్ తెలిపాడు. అదే సమయంలో మొయిన్ అలీ, శ్రీలంక స్టార్ స్పిన్నర్ మహేష్ తిక్షణ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరారు. సమీర్ రిజ్వీతో పాటు ముఖేష్ చౌదరిని ప్రత్యామ్నాయంగా ఉంచారు. శివమ్ దూబే ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేరాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. మయాంక్ అగర్వాల్ మరియు ట్రావిస్ హెడ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాలేదు. ప్లేయింగ్ ఎలెవన్‌లో నటరాజన్‌కు చోటు కల్పించారు. ట్రావిస్ హెడ్‌ను ప్రత్యామ్నాయంగా ఉంచారు. మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం బాగాలేదని పాట్ కమిన్స్ చెప్పాడు.

We’re now on WhatsAppClick to Join

సన్‌రైజర్స్ హైదరాబాద్- అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (సి), జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.

సీఎస్‌కే– రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.

Also Read: CSK vs SRH: 54 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నై