SRH Retain: IPL 2025 కోసం మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ముగ్గురు ఆటగాళ్ల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది. ‘ఈఎస్‌పిఎన్ క్రిక్‌ఇన్‌ఫో’ వార్తల ప్రకారం హైదరాబాద్ జట్టులో హెన్రిచ్ క్లాసెన్ ఫస్ట్ ఛాయిస్. క్లాసెన్‌ను నిలుపుకోవడానికి SRH అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేస్తుంది. దీంతో పాటు పాట్ కమిన్స్, అభిషేక్ శర్మలను కూడా రిటైన్ (SRH Retain) చేయాలని జట్టు భావిస్తోంది. అక్టోబరు 31వ తేదీని బీసీసీఐకి రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు చివరి తేదీ అని మనకు తెలిసిందే. గత సీజన్‌లో హైదరాబాద్ ప్రదర్శన అద్భుతంగా ఉండడంతో ఫైనల్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ మొదటి ఎంపిక క్లాసెన్
IPL 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నప్పుడు హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శన బలంగా ఉంది. క్లాసెన్ సామర్థ్యాన్ని చూసి హైదరాబాద్ అతడిని నిలబెట్టుకోవాలని నిర్ణయించుకుంది. ESPN Cricinfo నివేదిక ప్రకారం.. క్లాసెన్ SRH మొదటి ఎంపిక. అతని కోసం వారు రూ. 23 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జట్టు రెండో ఆటగాడిగా ప్యాట్ కమిన్స్‌ను కొనసాగించాలని భావిస్తోంది.
SRH కమిన్స్‌ను రూ.18 కోట్లకు తన వద్దే ఉంచుకోవాలని యోచిస్తోంది. అదే సమయంలో గత సీజన్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మను కూడా హైదరాబాద్ రిటైన్ చేసుకోనుంది. అతనిని 14 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకోవాలని జట్టు నిర్ణయించినట్లు సమాచారం.
Also Read: Hardik Pandya : హార్దిక్ యో-యో బెస్ట్ టెస్ట్ రికార్డ్ ఇదే
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆస్ట్రేలియన్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, టీమిండియా ఆటగాడు నితీష్ రెడ్డిని కూడా రిటైన్ చేసుకోవాలని భావిస్తోంది. గత సీజన్‌లో హెడ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ ఆసీస్ ఓపెనర్ ఐపీఎల్ 2024లో ఆడిన 15 మ్యాచ్‌ల్లో 191.55 స్ట్రైక్ రేట్‌తో 567 పరుగులు చేశాడు. హెడ్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి సెంచరీ కూడా చేశాడు. అదే సమయంలో హెడ్ 5 అర్ధ సెంచరీలు కూడా చేశాడు.
మరోవైపు ఇటీవలే టీమ్ ఇండియాకు అరంగేట్రం చేసిన నితీష్ రెడ్డి ప్రదర్శన కూడా హైదరాబాద్ కు బలంగానే ఉంది. ఇది మాత్రమే కాదు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీష్ కేవలం 34 బంతుల్లో 74 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. SRH తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో నితీష్ 142 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు చేశాడు. అదే సమయంలో తన బౌలింగ్‌లో మూడు వికెట్లు తీశాడు.