Site icon HashtagU Telugu

IPL 2024 : 5 ఓవర్లలో 103 రన్స్ కొట్టి SRH సరికొత్త రికార్డు

KKR vs SRH

KKR vs SRH

ఐపీల్ 2024 సీజన్ లో SRH దుమ్ములేపుతుంది. ప్రత్యర్థి జంట ఏదైనా సరే..వారికీ చెమటలు పట్టిస్తూ..SRH ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తుంది. మొన్న చిన్న జీయర్ స్వామి స్టేడియంలో RCB vs SRH మ్యాచ్ లో అనేక రికార్డ్స్ బ్రేక్ చేసిన SRH ..ఈరోజు ఢిల్లీ తో ఆడుతున్న మ్యాచ్ లో కూడా హెడ్..అభిషేక్ వీరబాదుడు బాదుతున్నారు. 5 ఓవర్లలో 103 రన్స్ కొట్టి చరిత్ర సృష్టించారు. గతంలో ఈ రికార్డు KKR పేరిట ఉంది. 2017లో ఆ టీమ్ RCBపై 105 రన్స్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును SRH బద్దలుకొట్టింది.

ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో హెడ్ , అభిషేక్ ఇద్దరు ఎక్కడ తగ్గడం లేదన్నట్లు వీరబాదుడు బాదారు. నువ్వు సిక్స్ కొట్టు..నేను సిక్స్ కొడతా అంటూ ఇద్దరు ఆరెంజ్ బ్యాట్స్మెన్స్..ఓ రేంజ్ లో ఆడేసారు. ఈ క్రమంలో అభిషేక్ 12 బాల్స్ లలో 46 రన్స్ కొట్టి అవుట్ కాగా..ఆ తర్వాత వచ్చిన మార్కెర్మ్ 1 రన్ కొట్టి అవుట్ అయ్యాడు. ఇలా రెండు వికెట్స్ వెంటవెంటనే పడడం కాస్త నిరాశకు గురి చేసింది. ఇక హెడ్ ప్రస్తుతం 85 రన్స్ తో క్రేజ్ లో ఉన్నాడు.

Read Also : Chiranjeevi : చిన్నప్పుడు క్రికెట్‌లో జరిగిన గాయం గురించి.. హీరో కార్తికేయతో షేర్ చేసుకున్న చిరు..