Sunrisers Hyderabad: SRH హెడ్‌కోచ్‌గా సెహ్వాగ్ ?

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హెడ్ కోచ్ విషయంలో సందిగ్దత నెలకొంది. కొన్ని సీజన్లుగా దారుణంగా విఫలమవుతున్న రైజర్స్ జట్టు 2024 ఐపీఎల్ లో సత్తా చాటాలని భావిస్తుంది

Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హెడ్ కోచ్ విషయంలో సందిగ్దత నెలకొంది. కొన్ని సీజన్లుగా దారుణంగా విఫలమవుతున్న రైజర్స్ జట్టు 2024 ఐపీఎల్ లో సత్తా చాటాలని భావిస్తుంది. ఈ మేరకు జట్టు యాజమాన్యం ప్రక్షాళన చేపట్టనుంది. త్వరలోనే కొత్త హెడ్ కోచ్ ను పరిచయం చేయబోతుంది. టీమిండియాలో రికార్డులు సృష్టించిన మాజీ ఆటగాడు త్వరలో సన్ రైజర్స్ హెడ్ కోచ్ గా రాబోతున్నట్టు సమాచారం.

2020 నుంచి సన్ రైజర్స్ ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. గత సీజన్లో 14 మ్యాచ్ లు ఆడి కేవలం నాలుగంటే నాలుగు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. సీజన్ సీజన్ కి ఎస్ఆర్ హెచ్ ఉనికిని కోల్పోతుంది. కోట్ల రూపాయలు పెట్టి ప్లేయర్స్‌ను కొనుగోలు చేసినా, కెప్టెన్లను మార్చినా సన్ రైజర్స్ కథ మారడంలేదు. వచ్చే సీజన్లో ఎలాగైనా ప్రాంచైజీ పూర్వవైభవాన్ని తీసుకురావాలని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం భావిస్తుంది. ఈ క్రమంలో హెడ్ కోచ్ ని మారిస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు హెడ్ కోచ్ గా కరేబియన్ విధ్వంసకరుడు బ్రియాన్ లారా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే జట్టుపై లారా ఇంపాక్ట్ ఏమంత లేకపోవడంతే కోచ్ లో మార్పు కోరుకుంటుంది ఆ జట్టు యాజమాన్యం.

ఎస్ఆర్‎హెచ్ హెడ్‌కోచ్‌ పదవి కోసం టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ లో దూకుడు ప్రదర్శించే సెహ్వాగ్ హైద్రాబాద్ జట్టుకి కోచ్ గా వస్తే జట్టు బలంగా మారే అవకాశముంది. ఇక వీరూకి ఐపీఎల్ ఆడిన అనుభవం కూడా ఉంది. సో వీరేంద్ర సెహ్వాగ్ అయితేనే జట్టును ముందుకు నడిపించగలడని యాజమాన్యం గట్టిగ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న సన్ రైజర్స్ కి సెహ్వాగ్ లాంటి అనుభవం ఉన్న సీనియర్ హెడ్ కోచ్ గా వస్తే అంతకంటే కావాల్సిందేముంది.

Also Read: Tollywood and Politics :`హిమాన్ష్`మార్క్! `మూడో త‌రం` ముస్తాబు!!