IPL 2022 సీజన్ లో గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ ….సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో SRH 21 పరుగుల తేడా పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంతో…ఆ జట్టు ఓనర్ కావియా మారన్ మరోసారి వార్తల్లో నిలిచింది. 2014 నుంచి 2021 వరకు డేవిడ్ వార్నర్ SRHకు ఆడాడు. 2016 సీజన్లో సన్ రైజర్స్ వార్నర్ ఛాంపియన్. అయితే 2021 సీజన్ లో సన్ రైజర్స్ ఓనర్లకు వార్నర్ కు మధ్య తలెత్తిన వివాదంతో…SRH వార్నర్ వదిలేసింది.
2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున వార్నర్ ఆడుతుండటం…ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై వార్నర్ తన ప్రతీకారం తీర్చుకున్నాడు. 58 బంతుల్లో 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 12ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్ కావియా మారన్ ను ట్రోల్ చేసేలా చేసింది. వార్నర్ తన సూపర్ ఇన్నింగ్స్ తో కావియా మారన్ తిక్క కుదిర్చాడంటూ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.