Site icon HashtagU Telugu

Brydon Carse: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ పై కన్నేసిన కావ్య పాప

Brydon Carse

Brydon Carse

Brydon Carse: సన్‌రైజర్స్ హైదరాబాద్ గత సీజన్లో తృటిలో టైటిల్ కోల్పోయింది. కానీ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆ జట్టు పూర్తిగా బలంగా తయారైంది. అంతేకాదు గత సీజన్ తో ఆ జట్టు అభిమానుల ఫాలోయింగ్ మరియు బ్రాండ్ విలువను భారీగా పెంచుకుంది. వచ్చే సీజన్ కోసం ఫ్రాంచైజీ మరింత ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జట్టులో ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ మరియు కెప్టెన్ పాట్ కమిన్స్ రూపంలో బలమైన విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కమిన్స్ ఆల్‌రౌండర్ అయినప్పటికీ బ్యాటింగ్‌ విషయానికి వస్తే అతనిపై నమ్మకం పెట్టుకోలేం. అయితే ఇంగ్లాండ్‌కు చెందిన బ్రైడెన్ కార్స్ (Brydon Carse) వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది.

బ్రైడెన్ కార్స్ ను హైదరాబాద్ జట్టు కోటి రూపాయలకు దక్కించుకుంది. కాగా బ్రైడెన్ కార్స్ ఆల్ రౌండర్ గా టీమిండియాపై సత్తా చాటుతున్నాడు. టీమిండియాతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం బ్రేడెన్ కార్సేను జట్టులోకి తీసుకున్నారు. రెండో టి20లో జట్టులోకి వచ్చిన బ్రైడెన్ కార్స్ సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. మొదట బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత బంతితో టీమిండియా ఆధిపత్యం చెలాయించాడు. ఇన్నింగ్స్ లో కర్స్ 17 బంతుల్లో 3 సిక్సర్లు బాది 31 పరుగులు చేశాడు. 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బ్రైడెన్ కార్స్ ఈ అద్భుత ప్రదర్శనతో సన్ రైజర్స్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేస్తుంది.వచ్చే సీజన్లో బ్రైడెన్ కార్స్ సేవలను మరింత ఎక్కువగా వినియోగించుకోవాలని భావిస్తుంది. అతనికి కాస్త సపోర్ట్ ఇస్తే జట్టును విజయతీరాలకు చేరుస్తాడని కావ్య మారన్ భావిస్తుంది.

Also Read: Dhruv Jurel: జట్టులో కీలక మార్పు.. డిసైడింగ్ మ్యాచ్ పై గంభీర్ ఫోకస్

టీమ్ ఇండియాతో జరగబోయే మ్యాచ్‌లతోపాటు వచ్చే ఐపీఎల్ లో బ్రైడన్ ఎలాంటి అద్భుతాలు చేస్తాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటె బ్రైడెన్ కార్స్ ఇంగ్లండ్‌ తరఫున 5 టీ20ల్లో కార్సే 9 వికెట్లు పడగొట్టాడు. 3 ఇన్నింగ్స్‌ల్లో ఒకసారి నాటౌట్‌గా ఉండగా 31 పరుగులు చేశాడు. ఓవరాల్ టీ20 క్రికెట్లో ఈ ఆటగాడు 79 మ్యాచ్‌ల్లో 47 వికెట్లతో పాటు 777 పరుగులు చేశాడు. అంతేకాదు బ్రైడెన్ కార్స్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 141 పైనే ఉంది.

Exit mobile version