హనుమ విహారి పై SRH ఫ్యాన్స్ ట్రోల్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ వర్సెస్ హనుమ విహారీ గొడవ రోజురోజుకూ ముదురుతోంది. ఫ్యాన్స్ హనుమ విహారీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటే.. హనుమ విహారీ కూడా అదే రేంజ్‌లో లాక్ డౌన్ కిడ్స్ అంటూ ఫ్యాన్స్‌పై కౌంటర్లు వేస్తున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చెపాక్ లాంటి స్లో పిచ్‌లో సీఎస్కేను ఓడించి ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. గతంలో హనుమ విహారీ చేసిన స్లో పిచ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్లు రాణించలేరు అన్న కామెంట్స్‌కు కౌంటర్ […]

Published By: HashtagU Telugu Desk
Srh Fans Troll Hanuma Vihar

Srh Fans Troll Hanuma Vihar

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ వర్సెస్ హనుమ విహారీ గొడవ రోజురోజుకూ ముదురుతోంది. ఫ్యాన్స్ హనుమ విహారీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటే.. హనుమ విహారీ కూడా అదే రేంజ్‌లో లాక్ డౌన్ కిడ్స్ అంటూ ఫ్యాన్స్‌పై కౌంటర్లు వేస్తున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చెపాక్ లాంటి స్లో పిచ్‌లో సీఎస్కేను ఓడించి ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. గతంలో హనుమ విహారీ చేసిన స్లో పిచ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్లు రాణించలేరు అన్న కామెంట్స్‌కు కౌంటర్ అటాక్ ఇస్తూ తిరుమలశెట్టి సుమన్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

హనుమ విహారీ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ మధ్య ఈ వివాదం చాలా రోజులుగా కొనసాగుతూ వస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను అభిమానించే కొంతమంది అభిమానులను టార్గెట్ చేస్తూ లాక్ డౌన్ కిడ్స్ అంటూ హనుమ విహారీ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశాడు. తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, ట్రోల్స్ కూడా చేస్తున్నారంటూ గతంలో వీడియోలు కూడా పెట్టాడు. అయితే, తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కి చేరుకోవడంతో మరోసారి హనుమ విహారీని ఆరెంజ్ ఆర్మీ గుర్తు చేసుకుంది.

ఐపీఎల్ 2026 సగం సీజన్ ముగిసిన తర్వాత సన్‌రైజర్స్ వరుస విజయాలు సాధిస్తున్న సమయంలో హనుమ విహారీ తన ప్లే ఆఫ్స్ టీమ్స్‌ను ప్రకటించాడు. అందులో సన్‌రైజర్స్ పేరు లేదు. పంజాబ్, ఆర్సీబీ, సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయని విహారీ చెప్పాడు. హనుమ విహారీ చెప్పిన తర్వాత నుంచి పంజాబ్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చెన్నై సూపర్ కింగ్స్ తడబడుతూ సన్‌రైజర్స్‌పై ఓటమితో మొత్తానికి ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయింది.

గుజరాత్ టైటాన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిన తర్వాత హనుమ విహారి మరింత ఘాటు వ్యాఖ్యలు చేశాడు. సన్‌రైజర్స్ జట్టు ఫ్లాట్ పిచ్‌ల మీదే ఆడుతుందని, స్లో పిచ్‌ల‌పై రాణించలేదంటూ చెప్పుకొచ్చాడు. అందుకే అహ్మదాబాద్ పిచ్‌పై వందలోపే ఆలౌట్ అయిందంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై తెలుగు కామెంటేటర్, మాజీ క్రికెటర్ తిరుమలశెట్టి సుమన్ పరోక్షంగా కౌంటర్ అటాక్ ఇచ్చాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన తర్వాత తిరుమలశెట్టి సుమన్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో హనుమ విహారీ పేరు డైరెక్ట్‌గా తీసుకురాకపోయినా.. గతంలో విహారీ చేసిన ఫ్లాట్ పిచ్‌లపైనే సన్‌రైజర్స్ గెలుస్తుందని, స్లో పిచ్‌లపై బ్యాటింగ్ చేయలేదన్న కామెంట్స్‌పైనే సుమన్ కౌంటర్ అటాక్ ఇచ్చాడు. చెపాక్‌లో అదే స్లో పిచ్‌పై సన్‌రైజర్స్ ఆడిన తీరును సుమన్ వివరించాడు.

సన్‌రైజర్స్ టీమ్‌లో ఛాంపియన్స్ ఉన్నారని.. ప్రపంచ క్రికెట్‌లో ఆడిన ఎంతో మంది మేటి ఆటగాళ్లు ఉన్నారని, వాళ్లకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆడాలో తెలుసని చెప్పుకొచ్చాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లాంటి వాళ్లంతా ఛాంపియన్ క్రికెటర్స్ అని సుమన్ గుర్తు చేశాడు. మరోసారి ఎవరైనా సన్‌రైజర్స్ ఫ్లాట్ పిచ్‌లపైనే స్కోర్ చేస్తుందని అంటే వాళ్లకి చెపాక్‌లో విజయాన్ని గుర్తు చేయాలని చెప్పాడు.

అయితే, తిరుమలశెట్టి సుమన్ పోస్టు చేసిన వీడియో కింద సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ హార్ట్ ఎమోజీలతో కామెంట్ బాక్స్‌ని నింపేశారు. అంతేకాకుండా కొందరు ఫ్యాన్స్ అయితే.. ఇవే మాటలు కొంచెం హనుమ విహారికి కూడా చెప్పు అని కామెంట్స్ చేశారు. మొత్తానికి హనుమ విహారీ వర్సెస్ సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అనే ఈ సిరీస్ ఈ సీజన్ ముగిసే వరకూ కొనసాగుతుందని కచ్చితంగా చెప్పొచ్చు.

 

  Last Updated: 19 May 2026, 02:37 PM IST