IND VS SA : కటక్ పిచ్ వారికే అనుకూలం

సొంత గడ్డపై సఫారీ టీమ్ తో తొలి టీ ట్వంటీ లో ఓటమి భారత్ కు ఊహించని షాక్ గానే చెప్పాలి. భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యంతో పరాజయం పాలైంది. ఐపీఎల్ లో రాణించిన మన బౌలర్లు తొలి మ్యాచ్ లో చేతులెత్తేశారు.

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 01:13 PM IST

సొంత గడ్డపై సఫారీ టీమ్ తో తొలి టీ ట్వంటీ లో ఓటమి భారత్ కు ఊహించని షాక్ గానే చెప్పాలి. భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యంతో పరాజయం పాలైంది. ఐపీఎల్ లో రాణించిన మన బౌలర్లు తొలి మ్యాచ్ లో చేతులెత్తేశారు. దీనికి తోడు పంత్ కెప్టెన్సీ కూడా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న రెండో టీ ట్వంటీ లో భారత్ ఎలా ఆడుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న బారాబతి స్టేడియంలో భారత్ రికార్డు బాగానే ఉంది. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. అంతర్జాతయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ మ్యాచ్ లు జరిగిన సమయంలోనూ స్పిన్నర్లు ఆధిపత్యం కనబరిచారు. గతంలో ఇక్కడ దక్షిణాఫ్రికా తో ఒక టీ ట్వంటీ ఆడిన భారత్ పరాజయం పాలయ్యింది. అయితే శ్రీలంకతో జరిగిన మరో మ్యాచ్ మాత్రం ఘన విజయం సాధించింది.

ఇక్కడ చాలా సందర్భాల్లో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. కటక్ పిచ్ పై యావరేజ్ స్కోర్ 136 మాత్రమే. ఇక్కడ 150 పరుగుల స్కోరు కాపాడుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఐపీఎల్ మ్యాచ్ లోనూ ఈ పిచ్ పై స్పిన్నర్ల డామినేషన్ స్పష్టంగా కనిపించింది. 7 ఐపీఎల్ మ్యాచ్ ల్లో అత్యధిక వికెట్లు స్పిన్నర్లు పడగొట్టారు. ప్రస్తుతం భారత్ జట్టులో ఉన్న చాహల్ కు ఇక్కడ మంచి రికార్డు ఉంది. దీంతో రెండో టీ ట్వంటీ లో చాహల్ కీలకం కానున్నాడు. బారాబతి వికెట్ స్లో గా ఉంటుంది. దీంతో బ్యాటర్లు పరుగులు చేసేందుకు శ్రమించాల్సిందే. కాసేపు క్రీజులో నిలదొక్కుకుని ఆడితే రన్స్ చేయొచ్చు. భారీ షాట్లు ఆడితే మాత్రం వికెట్ చేజార్చుకోవాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్ లో పంత్ కెప్టెన్సీ కూడా ఆకట్టుకోలేదు. దీంతో ఆ మ్యాచ్ లో.చేసిన తప్పిదాలు మళ్లీ రిపీట్ చేయకుండా…కాస్త దూకుడుగా వ్యవహరించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.