Site icon HashtagU Telugu

Spectacular Catch:ఫిలిప్స్ ..ది సూపర్ మ్యాన్

Catch

Catch

క్రికెట్ లో క్యాచ్ లు మ్యాచ్ లను గెలిపిస్తాయి. అందుకే ఫీల్డర్లు క్యాచ్ లు అందుకునేందుకు విన్యాసాలు చేయక తప్పదు. ఒక్కోసారి కష్ట సాధ్యమైన క్యాచ్ లు అందుకునే క్రమంలో ఫీల్డర్ల ఫీట్స్ చూస్తే వారేవా అనకుండా ఉండలేం. తాజాగా టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ 12 తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ పట్టిన క్యాచ్ హైలైట్ గా నిలిచింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 8వ ఓవర్ లో ఈ ఫీట్ జరిగింది. శాంట్నర్‌ బౌలింగ్‌లో.. స్టోయినిస్‌ కవర్స్‌ దిశగా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే అది మిస్‌ టైమ్‌ బంతి గాల్లోకి లేచింది.
ఈ క్రమంలో స్వీపర్‌ కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఫిలిఫ్స్‌ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్‌ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో ఒక్క సారిగా స్టేడియంలో ఉన్న ఆటగాళ్లతో పాటు అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఫిలిప్స్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.